Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో త‌దుప‌రి సినిమాల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఈసారి ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో క‌థ‌ల విష‌యంలో ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తున్నాడ‌ట‌. మ‌నం ఫేమ్

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (16:59 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో త‌దుప‌రి సినిమాల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఈసారి ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో క‌థ‌ల విష‌యంలో ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తున్నాడ‌ట‌. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్‌తో బ‌న్నీ సినిమా అంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే... స్టోరీ సెకండాఫ్ సంతృప్తిక‌రంగా రాక‌పోవ‌డం వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ టాక్ వ‌చ్చింది.
 
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... బ‌న్నీకి ఇటీవ‌ల‌ విక్ర‌మ్ కుమార్ ఫుల్ స్టోరీ చెప్ప‌డం.. అది బాగా న‌చ్చ‌డంతో బ‌న్నీ విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ని తెలిసింది. ఇక క‌థ విష‌యానికి వ‌స్తే... ఇది పున‌ర్జ‌న్మ‌ల నేప‌ధ్యంతో ఉంటుంద‌ట‌. ఇందులో బన్నీ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం చాలా స్పీడుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుగుతుంది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments