Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శైల‌జారెడ్డి అల్లుడు అంద‌రూ అనుకునే క‌థ కాదా..?

నాగ చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమా అన‌గానే.. నాగార్జున అల్ల‌రి అల్లుడు సినిమాలా ఉంటుంది. అత్త పొగ‌రుని అణిచే అల్లుడు క‌థ అంటూ టాక్ వినిపించింది. అత్త‌, అల్లుడు క‌థ‌లు చాలా వ‌చ్చాయి. ఆ కోవ‌లే ఉండే క‌థే అనుకున్నారు. కానీ.. శైల‌జారెడ్డి అల్లుడు అంద

Advertiesment
శైల‌జారెడ్డి అల్లుడు అంద‌రూ అనుకునే క‌థ కాదా..?
, శనివారం, 14 జులై 2018 (21:21 IST)
నాగ చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమా అన‌గానే.. నాగార్జున అల్ల‌రి అల్లుడు సినిమాలా ఉంటుంది. అత్త పొగ‌రుని అణిచే అల్లుడు క‌థ అంటూ టాక్ వినిపించింది. అత్త‌, అల్లుడు క‌థ‌లు చాలా వ‌చ్చాయి. ఆ కోవ‌లే ఉండే క‌థే అనుకున్నారు. కానీ.. శైల‌జారెడ్డి అల్లుడు అంద‌రూ అనుకున్న‌ట్టు ఇది అత్త‌, అల్లుడు క‌థ కాదంట‌. అవును.. ఇది నిజం అని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... త‌ల్లికూతురు ఇద్ద‌రికి ఇగో ఎక్కువ‌ట‌. వారిద్ద‌రి ఈగోల మ‌ధ్య హీరో ఎలా స‌త‌మ‌త‌మ‌య్యాడు.. వారిద్ద‌రిని ఎలా దారిలోకి తెచ్చాడు అనేదే క‌థ అని తెలిసింది. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల‌ను చూస్తుంటే... మారుతి అంద‌రూ అనుకున్న‌ట్టు కాకుండా కాస్త కొత్త‌గానే ఆలోచించాడ‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా వేసిన విలేజ్ సెట్లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.
 
ఈ నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రిగే షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ త‌ర్వాత ఆగ‌ష్టు ఫ‌స్ట్ వీక్ నుంచి ప్ర‌మోష‌న్స్ పైన దృష్టి పెట్టాల‌నుకుంటున్నారు. ఆగ‌ష్టు థ‌ర్డ్ వీక్‌లో ఆడియో రిలీజ్ చేసి... చిత్రాన్ని ఆగ‌ష్టు 31న రిలీజ్ చేసేందుకు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు శైల‌జారెడ్డి అల్లుడు స‌క్స‌స్ సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఎన్టీఆర్ బ‌యోపిక్'లో రకుల్ ప్రీత్ సింగ్, ఎన్టీఆర్ వీరాభిమాని?