Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో శ్యామ్ కె నాయుడు... పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఫిర్యాదు (video)

Webdunia
బుధవారం, 27 మే 2020 (15:21 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాక్ కె నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. శ్యామ్ కె నాయుడు తనను మోసం చేసినట్టు ఓ సినీ నటి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా, పెళ్లి చేసుకుంటానని, ప్రమాణం చేసి, ఇపుడు మోసం చేశాడని ఆమె అందులో పేర్కొంది. ఆ నటి పేరు సాయిసుధ. ఈమె ఫిర్యాదుతో శ్యామ్ కె నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు తమ్ముడే శ్యామ్ కె నాయుడు. బిజినెస్ మెన్, పోకిరి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి ఎన్నో చిత్రాలకు ఆయన పని చేశారు. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో సాయి సుధ సపోర్టింగ్ రోల్ పోషించింది. శ్యామ్ కె నాయుడిపై కేసు నమోదు కావడంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడేందుకు సాయిసుధ నిరాకరించింది. ఒకవేళ శ్యామ్ కె నాయుడుపై పోలీసులు చర్య తీసుకోని పక్షంలో అపుడు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు బహిర్గతం చేస్తానని తెలిపింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments