Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అబ్బాయిల కోసం సిద్ధంగా అమ్మాయిలు : లిస్బన్ పబ్‌లో చీకటి బాగోతం

అబ్బాయిల కోసం సిద్ధంగా అమ్మాయిలు : లిస్బన్ పబ్‌లో చీకటి బాగోతం
, శుక్రవారం, 20 డిశెంబరు 2019 (11:49 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌కు సమీపంలో చీకటి బాగోతం బయటపడింది. 21 మంది అమ్మాయిలు 9 మంది అబ్బాయిలతో ఎంటర్‌టైన్మెంట్ పేరుతో ఎంజాయ్ చేస్తూ పట్టుబడ్డారు. ఎంటర్‌టైన్‌మెంట్ ముసుగులో సాగుతున్న దందాను పోలీసులు రట్టుచేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్‌కు సమీపంలో లిస్బన్ పబ్ ఉంది. ఈ పబ్‌కు ఒంటరిగా వచ్చే అబ్బాయిల కోసం నిర్వాహకులే అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. నచ్చిన అమ్మాయిని వెంటేసుకొని లోపల హుషారుగా చిందులేసేలా ఏర్పాట్లు చేస్తారు. మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. వీలుపడితే అంతకుమించి(శృంగారం) అడుగు ముందుకేయొచ్చు. 
 
తమ పబ్‌కు వచ్చిన కస్టమర్‌ వెనక్కి వెళ్లిపోవద్దనే బిజినెస్‌ సీక్రెట్‌తో నిర్వాహకులు కోరిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం, డీజీపీ నివాసానికి సమీపంలోని బేగంపేట కంట్రీక్లబ్‌ ఆవరణలోని లిస్బన్‌ పబ్‌లో అర్థరాత్రుళ్లు కొన్నసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలివి. 
 
పబ్‌ కల్చర్‌ ముసుగులో విశృంఖలతను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో లిస్బన్‌ పబ్‌పై బుధవారం రాత్రి 11 గంటల సమయంలో టాస్క్‌ఫోర్స్‌, పంజాగుట్ట పోలీసులు దాడిచేశారు. వారికి లోపల 'ఊహించినవే' కనిపించాయి. అక్కడి గదుల్లో అంతా కురుచదస్తుల్లో అమ్మాయిలు.. వారితో అబ్బాయిలు కనిపించారు. 22 మంది యువతులు, 9 మంది యువకులు... పబ్‌ మేనేజర్‌ భరద్వాజ్‌, క్యాషియర్‌ శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగుళూరు సెంట్రల్ డీసీపీ వినూత్నశైలి... జాతీయ గీతం ఆలాపనతో...