Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాబ్ రచ్చ : రామచంద్ర గుహ చేతులకు సంకెళ్లు

Advertiesment
Historian Ramachandra Guha
, గురువారం, 19 డిశెంబరు 2019 (12:37 IST)
ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ చేతులకు బెంగుళూరు నగర పోలీసులు సంకెళ్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల్లో భాగంగా, గురువారం బెంగుళూరులో నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో రామచంద్రగుహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతుండగా, కొంతమంది పోలీసులు వచ్చి ఆయన్ను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించాు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, గాంధీ చిత్రపటాన్ని పట్టుకుని మీడియాతో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. కేంద్ర కనుసన్నల్లో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వివక్షతో కూడాని చట్టాన్ని వ్యతిరేకిస్తూ అహింసాయుతంగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని... ఇక్కడెక్కడైనా మీకు హింసాత్మక ధోరణి కనిపిస్తోందా? అని ప్రశ్నించారు.
 
అలాగే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బుధవారం మంగళూరులో జరిగిన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతోపాటు రాష్ట్రంలోని గుల్బర్గా, తదితర ప్రాంతాలలో భారీగా ర్యాలీలు సాగాయి. ఈనేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి నిషేధాజ్ఞలు అమలులోకి రానున్నాయి.
 
నిజానికి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలోని ముస్లిమేతరులందరికీ భారత్‌లో పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని ఉద్దేశించినప్పటికీ ప్రత్యేక టిబెట్‌ కోసం దశాబ్దాలుగా పోరాడుతూ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న వేలాదిమంది బౌద్ధ భిక్షువులు మాత్రం తమకు భారత పౌరసత్వం అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. చైనా ఆక్రమణ నుంచి టిబెట్‌కు విముక్తి కల్పిస్తే అదే పదివేలని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం .. చంద్రబాబు హెచ్చరిక :: ప్రెస్ రివ్యూస్