Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

డీవీ
శనివారం, 11 జనవరి 2025 (16:02 IST)
gamechanger latest poster
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ బాక్స్ ఆఫీస్‌లో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారా లేదా అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. 186 కోట్లు మేకర్స్ ప్రకటించడం వాస్తవం కాదనే వార్త కూడా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో పలు వెబ్‌సైట్‌లు, గేమ్ ఛేంజర్ డే 1 నంబర్‌లు నకిలీవని పేర్కొన్నాయి. ఇంచుమించు 85 కోట్లకు మించి వసూలు రాలేదని తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో ఇప్పటికే ఈ సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజుకు దాదాపు 200 కోట్ల డెఫిషిట్ వస్తుందని తేల్చి చెబుతున్నాయి.
 
ఇందుకు కారణం లేకపోలేదు. మూడేళ్ళకు పైగా సినిమాను తీయడం పెట్టిన పెట్టుబడి ఫైనాన్షియర్ల నుంచి కొంత తీసుకోవడంతో వడ్డీలు పెరిగిపోయి తడిసి మోపుడయిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. శుక్రవారంనాడు రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోల తర్వాత పెద్దగా హడావుడి లేదని నివేదికలు తెలియజేస్తున్నారు. శని, ఆదివారాలతోపాటు సంక్రాంతి పండుగ మూడురోజుల వరకు కాస్త కలెక్లన్ల జోరు అందుకుంటాయని మేకర్స్ భావిస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాయి. కానీ బాలక్రిష్ణ, వెంకటేష్ సినిమాలు కూడా విడుదల కావడంతో థియేటర్లు, కలెక్టన్లు పంచుకుంటాయని ఎగ్జిబిటర్లు తెలియజేస్తున్నారు.
 
అసలు గేమ్ ఛేంజర్ కు నెగెటివ్ టాక్ అనేది భారతీయుడు2 సినిమా రిలీజ్ తర్వాత ఆటోమేటిక్‌గా అభిమానులే తేల్చి చెప్పారు. దర్శకుడు శంకర్‌లో స్టఫ్ అయిపోయిందనీ, గత సినిమాల్లోని పాయింట్లను కొత్తగా నేపథ్యంతో చూపిస్తూ ప్రయోగాలు చేశాడని టాక్ కూడా వుంది. ఇక గేమ్ ఛేంజర్‌లో కథలో కొత్తదనం లేకపోవడమే పెద్ద లోపంగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
 
దానికితోడు కేవలం సాంగ్స్ 10 కోట్లు ఖర్చుపెట్టడం, మెయిన్ తారాగణం రెమ్యునరేషన్, హెలికాప్టర్లు కూడా కావడంతో కూడా బడ్జెట్ పెరిగిందని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే శంకర్ దర్శకుడుతో సినిమాలు నిర్మాతలు చేసినా వారు బాగుపడిన సందర్భాలు లేవని ఇంతకుముందే సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ వ్యాఖ్యానించారు. హీరోలు బయటకు వెళ్ళాలంటే చార్టర్ ఫ్లయిట్ లు కూడా వాడిన సందర్భాలున్నాయి. ఇవన్నీ బడ్జెట్ ను కంట్రోల్ చేయలేకపోవడమే కారణంగా చెబుతున్నారు.
 
ఒక్క రోజులో గేమ్ ఛేంజర్‌కు నెగెటివ్ రావడానికి కారణం ఏమిటని కొందరు విశ్లేషిస్తే, ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఊహించని విధంగా సోషల్ మీడియాలో పైరసీలా కూడా కాదు ఏకంగా ఫుల్ హెచ్‌డీ క్లారిటీ ప్రింట్ బయటకి వచ్చేసింది. రీసెంట్‌గా పుష్ప 2 కి కూడా కొన్ని రోజులు తర్వాత వచ్చింది కానీ ఇలా రిలీజ్ రోజే ఒక పెద్ద సినిమా ప్రింట్ అది కూడా ఫుల్ క్లారిటీ ఉన్నది బయటకి రావడం అనేది షాకింగ్ అని చెప్పాలి. మరి ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఒకింత షాక్‌కి లోనవ్వగా అసలు దీనికి భాద్యులు ఎవరు అనే ప్రశ్నార్థకంగా మారింది. అందుకే భాద్యులు ఎవరో అనేది సినీ పెద్దలు సీరియస్‌గా తీసుకొని పరిశీలించాల్సిన అంశం వుందని ప్రముఖులు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments