Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వీన్‌తో హాలీవుడ్ స్టార్ మూవీ: రస్సెల్ క్రో కంగనా రనౌత్ రొమాన్స్ (video)

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (15:50 IST)
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ హాలీవుడ్ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రోతో ఆమె నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా తన అభిమానుల సందేశాన్ని రీట్వీట్ చేశారు. దీంతో ఈ హాలీవుడ్ హీరో కంగనాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. 
 
"క్వీన్" ఫేమ్ కంగనా రనౌత్‌తో కలిసి పని చేయాలని తన అభిమానులు సూచించారు. ఆ ట్వీట్‌లో “రెండు విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు గొప్ప నటులు, అకాడమీ అవార్డు విజేత రస్సెల్ క్రో, 4 సార్లు జాతీయ అవార్డు విజేత కంగనా రనౌత్ కలిసి సినిమా చేస్తే ఎంత బాగుంటుంది?” అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 
 
ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అది సినిమా ప్రియుల్లో విపరీతమైన అంచనాలకు దారితీసింది. 2000 సంవత్సరంలో రిడ్లీ స్కాట్ “గ్లాడియేటర్‌”లో ఉత్తమ నటనకు రస్సెల్ క్రో అకాడమీ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే.
 
రస్సెల్ క్రోవ్ నోహ్, ఎ బ్యూటిఫుల్ మైండ్, ది నైస్ గైస్, మ్యాన్ ఆఫ్ స్టీల్ వంటి చిత్రాలలో నటించి స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన క్రిస్ హేమ్స్‌వర్త్, నటాలీ పోర్ట్‌మ్యాన్, క్రిస్టియన్ బేల్ నటించిన "థోర్: లవ్ అండ్ థండర్ కో"లో కనిపించనున్నాడు. 
 
మరోవైపు కంగనా రనౌత్ చివరిసారిగా అశ్విని అయ్యర్ తివారి "పంగా"లో కనిపించింది. ప్రస్తుతం బహుభాషా చిత్రం "తలైవి"లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా నటిస్తుంది. ఆమె మరో చిత్రం "తేజస్"లో కూడా పైలట్ పాత్రలో నటిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్ ఇక ఉదయం 7 గంటల నుంచి పనిచేస్తుంది..

వంశీకి ఫిట్స్ - ఆస్తమా సమస్యలున్నాయ్... పనిష్మెంట్ సెల్‌లో ఉంచారు : పంకజశ్రీ

Botsa Satyanarayana: పయ్యావుల పద్దు పనికిరాదు.. బొత్స సత్యనారాయణ

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments