Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌కృష్ణ‌ను పూరీ ఏమి అడిగాడో తెలుసా!

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (13:48 IST)
Liger team with balakirshna
నంద‌మూరి బాల‌కృష్ణ ఆహా! ఓటీటీలో స‌క్సెస్ ఫుల్‌గా నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌క‌మం అన్ స్టాప‌బుల్‌. దీనికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మొద‌ట్లో బాల‌కృష్ణ‌తో ఎలా చేస్తారో, అస‌లు ఆయ‌న ఎలా బిహేవ్ చేస్తాడో అనే డౌట్ చాలామందిలోనూ వుంది. కానీ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ స‌క్సెస్ బాట‌లో తీసుకెళ్ళాడు బాల‌య్య‌. మోహ‌న్‌బాబు, నాని, బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి, రాజ‌మౌళి, రానా వంటివారిని త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేస్తూ వీక్ష‌కుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు.
 
తాజాగా ఆయ‌న లైగ‌ర్ టీమ్‌తో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారంనాడే షూట్ ప్రారంభ‌మైంది. ఇందులో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, చార్మి, పూరీవున్న ఫొటో బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ ఒక్క‌సారిగా పాన్ ఇండియా లెవ‌ల్ స్థాయికి వెళ్ళ‌డానికి కార‌ణాన్ని అడుగుతూ విజ‌య్ నుంచి చ‌క్క‌టి స‌మాధాన రాబట్టార‌ని తెలిసింది. ఇక పూరీ, చార్మి మ‌ధ్య స్నేహం గురించి కూడా బాల‌య్య అడిగిన‌ట్లు తెలిసింది. 
 
అదేవిధంగా బాల‌య్య‌ను అభినందిస్తూ పూరీ జ‌గ‌న్నాథ్ ప‌లికిన మాట‌ల‌కు బాల‌య్య మ‌ధ్య‌లో అడ్డుత‌గులుతూ, చాల్లే పూరీగారు ఇవ‌న్నీ పాత‌వి అయిపోయాయి. కొత్త‌వి వుంటే చెప్పండంటూ అన‌గానే.. ఇండ‌స్ట్రీ పెద్ద‌గా మీరుంటే ఎలా వుంటుంది? అని ప్ర‌శ్న సంధించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీనికి ఆయ‌న ఏమి స‌మాధాన చెప్పాడోకానీ.. అది కానీ వ‌స్తే హైలైట్ అవుతుంది. కానీ ఆ ప్ర‌శ్న‌కు ఎడిట్ చేయాలా? వ‌ద్దా? అని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక లైగ‌ర్ ఆగ‌స్టు 25న విడుల చేయున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments