Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" కోసం భారీగా డిమాండ్ చేస్తున్న 'లోఫర్' బ్యూటీ!

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:10 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ "పుష్ప". అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. పైగా, ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగనుంది. 
 
పాన్ ఇండియా క‌థాంశంతో వివిధ భాష‌ల్లో తీస్తున్న ఈ మూవీలో గ్లామ‌ర్ కంటెంట్ పెంచడం కోసం బాలీవుడ్ అందాల భామ, తెలుగు వెండితెరకు లోఫర్ చిత్రంతో పరిచయమైన దిశా ప‌టానీని చిత్ర యూనిట్ సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.
 
నిజానికి సుకుమార్ చిత్రమంటే ఓ ఐటెం సాగ్ ఉండాల్సిందే. గత యేడాది వచ్చిన రంగస్థలం చిత్రంలో ఈ ఐటమ్ సాంగ్‌ను పూజా హెగ్డే చేసింది. ఈ పాట ద్వారా ఆమెకు సరైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలో జిగేల్ రాణిగా ముద్రపడింది. అలాగే, ఇపుడు "పుష్ప" చిత్రంలో ఐటమ్ సాంగ్‌ను దిశా పటానీతa చేయించాలన్నది దర్శకుడు సుకుమార్ ప్లాన్‌గా ఉంది.
 
అయితే, తెలుగులో ఆఫర్లు లేక బాలీవుడ్‌కు చెక్కేసిన దిశా పటానీ హిందీలో మాత్రం బాగా క్లిక్ అయింది. ఇప్ప‌టికే ఈ భామ "బాఘీ 3"లో 'డు యు ల‌వ్ మీ' అంటూ స్పెష‌ల్ సాంగ్‌లో హాట్ హాట్ అందాలతో క‌నువిందు చేసింది. సినిమాకు ఈ సాంగ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. అలాగే, 'పుష్ప' చిత్రాన్ని ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌నుండ‌టంతో అల్లు అర్జున్‌తో ప్ర‌త్యేక గీతంలో దిశా ప‌టానీ అయితే బాగుంటుంద‌ని సుకుమార్ అండ్ టీం ఫిక్స్ అయింద‌ట‌. 
 
ఈ నేప‌థ్యంలో మ‌రోవైపు 'పుష్ప' నిర్మాత‌లు దిశాప‌టానీ డిమాండ్‌తో పునరాలోచ‌న‌లో కూడా ప‌డిన‌ట్టు జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి కండల వీరుడు స‌ల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించి అందరినీ మెప్పించిన దిశాప‌టానీ డిమాండ్‌కు పుష్ప మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా..? లేదా..? అన్న‌ది తెలియాలంటే మ‌రికొంత కాలం ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments