భారత మాజీ ప్రధాని.. తెలుగుజాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రవాస భారతీయ సంఘాలన్నీ ముక్తకంఠంతో వినిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అమెరికాలో దీనిని రిమెంబరింగ్ పీవీ సిరీస్‌లా మూడు Rలతో ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారు.
1. శతాబ్ది జన్మదినం సందర్భంగా రిమెంబరింగ్ పీవీ నరసింహా రావు గారు
2. రిమైండ్ పీపుల్
3. రిక్వెస్ట్ భారత ప్రభుత్వం
భారతరత్న ఫర్ పీవీ డిమాండ్‌తో ప్రవాస భారతీయ సంఘాలు కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆన్‌లైన్ ద్వారా తమ డిమాండ్‌కు భారతీయుల మద్దతును కోరుతున్నాయి. అనేక ప్రవాస భారతీయ సంఘాలు, సంస్థలు పీవీ శతజయంత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 2020 నుండి డిసెంబర్ 2020 వరకు పీవీ ఘనతను స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.. ఈ కార్యక్రమాల ద్వారా పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌కు మద్దతు కూడగడుతున్నాయి.
అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పివి నరసింహారావు గురించి తెలిసిన ప్రముఖులు, మేధావులు నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అమెరికాలో ని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI), ఉత్తర అమెరికా తెలుగు సంఘము (TANA) ,అమెరికా తెలుగు సంఘం (ATA) ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS), ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA), సిలికానాంధ్ర, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF), సెయింట్ లూయిస్ గుజరాత్ సమాజ్ కోరుతున్నాయి.
అమెరికాకు చెందిన 81 సంస్థలు పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను బలంగా వినిపిస్తూ, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో ఉండే తెలుగు సంఘాలన్నీ దీనికి మద్దతు పలుకుతున్నాయి. భారతరత్న ఫర్ పీవీ అనే అభ్యర్థనను భారత ప్రభుత్వం గుర్తించేలా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. పీవీ శత జయంతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో ఆయనకు భారతరత్న వచ్చే వరకు తెలుగు సంఘాలు తమ వంతు కృషి చేస్తున్నాయి.
పీవీ ప్రాముఖ్యత, భారతీయ చరిత్రలో ఆయన స్థానం వివరిస్తూ, భారత్ రత్న పీవీకి ఇవ్వాలనే వినతి పత్రంపై ప్రవాస సంఘాలు సంతకాలు చేశాయి. అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ సంతకాల సేకరణ దిగ్విజయంగా కొనసాగుతోంది.
కార్యనిర్వాహక బృంద సభ్యులు స్వర్ణ ప్రసాద్, గుళ్ళపల్లి శ్రీనివాస్, డాక్టర్ అశోక్ కుమార్, చింతా ప్రవీణ్, తాళ్లూరి శ్రీధర్, అశ్విన్ పటేల్, కాజా విశ్వేశ్వర రావు (సెయింట్ లూయిస్ నుండి, MO), బడ్డి అశోక్, దేవబత్తిని హరి (డెట్రాయిట్, MI), మేడిచెర్ల మురళీకృష్ణ, కపిల ప్రకాష్, శరత్ చంద్ర (ఎడిసన్, NJ), పురం ప్రవీణ్ (అట్లాంటా, GA), కొండెపు సుధ (DC), చల్లా కవిత( వాషింగ్టన్ డీసీ),అట్లూరి శ్రీహరి(LA) కల్వకోట సరస్వతి (OH) ఇలా చాలా మంది ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు పీవీకి భారతరత్న డిమాండ్‌ను ముందుకు తీసుకువెళుతున్నారు.