Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీత గోవిందం' ప‌ర‌శురామ్ మరీ ఇంత సోంబేరా? అప్పుడు 25 లక్షలు ఇప్పుడు 6 కోట్లు, ఏమైంది?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (21:48 IST)
ఎవ‌రైనా అడ్వాన్స్ ఇస్తామంటే... వెంట‌నే తీసేసుకుంటాడు డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్. తీరా.. సినిమా ఎప్పుడు చేస్తావంటే.. ఇదిగో చేస్తాను.. అదిగో చేస్తాను అంటాడు. అయితే.. గీత గోవిందం సినిమా బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌డంతో అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత‌లు సినిమా ఎప్పుడు చేస్తావంటూ ప‌ర‌శురామ్ పైన ఒత్తిడి పెంచారు. మంచు విష్ణుతో సినిమా చేయాలి ప‌ర‌శురామ్.
 
అడ్వాన్స్ ఎప్పుడో ఇచ్చారు... చేయ‌కుండా అదిగో చేస్తాను ఇదిగో చేస్తాన‌నడంతో వెంట‌నే సినిమా చేయ‌మ‌న్నారు. గొడ‌వ పెద్ద‌ది కాకుండానే సెటిల్ చేసుకున్నాడు ప‌ర‌శురామ్. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స కూడా ప‌ర‌శురామ్‌కి అడ్వాన్స్ ఇచ్చారు. సినిమా ఎంత‌కీ చేయ‌క‌పోవ‌డంతో అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమన్నారు. 
 
తాజాగా సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ ప‌ర‌శురామ్‌కి 2008లో 25 ల‌క్ష‌లు అడ్వాన్స్ ఇచ్చార‌ట‌. అప్ప‌టి నుంచి సినిమా చేయ‌మ‌ని అడిగితే... అదిగోఇదిగో అంటున్నాడు కానీ.. సినిమా చేయ‌డం లేద‌ట ప‌ర‌శురామ్. ఇటీవ‌ల నాగచైత‌న్య‌తో ప‌ర‌శురామ్ సినిమాని ఎనౌన్స్ చేసాడు. ఈ మూవీని 14 రీల్స్ ఎంట‌ర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. 
 
అయితే.. 2008లో అడ్వాన్స్ ఇస్తే.. ఇప్ప‌టివ‌ర‌కు త‌న‌కు సినిమా చేయ‌క‌పోవ‌డంతో భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ ఈ విష‌యాన్ని ఫిల్మ్ ఛాంబ‌ర్ దృష్టికి తీసుకెళ్లార‌ట‌. త‌ను ఇచ్చిన 25 ల‌క్ష‌ల అడ్వాన్స్‌కు వ‌డ్డీతో క‌లిపి 6 కోట్లు ఇవ్వాలంటున్నార‌ట. ప‌ర‌శురామ్ రియాక్ష‌న్ ఏంటో..? ఛాంబ‌ర్ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో..? చూడాలి. మరోవైపు ఇదంతా తెలిసిన సినీజనం, ఛాన్సులు లేక ఎంతోమంది రోడ్లపై కాళ్లరిగేలా తిరుగుతుంటే పరుశురామ్ వచ్చిన అవకాశాలను ఇలా సాగదీస్తున్నారా? ఆయన మరీ ఇంత సోంబేరా అని గుసగుసలాడుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments