Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నేశాడంటే.. కోర్కె తీర్చాల్సిందే... దిలీప్ గుప్పెట్లో మలయాళ చిత్రపరిశ్రమ : డైరెక్టర్ ఆరోపణలు

నటి భావన కేసులో కేరళ పోలీసులు అరెస్టు చేసిన మలయాళ హీరో దిలీప్ నిజస్వరూపం మెల్లగా బయటపడుతోంది. ఆయన కన్నేశాడంటే.. ఎవరైనా లొంగిపోయి సలాం కొట్టాల్సిందేనట. అలా మలయాళ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తన గుప్పెట్లో

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (13:21 IST)
నటి భావన కేసులో కేరళ పోలీసులు అరెస్టు చేసిన మలయాళ హీరో దిలీప్ నిజస్వరూపం మెల్లగా బయటపడుతోంది. ఆయన కన్నేశాడంటే.. ఎవరైనా లొంగిపోయి సలాం కొట్టాల్సిందేనట. అలా మలయాళ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారట. అందుకే నటి భావనపై జరిగిన లైంగికదాడి కేసులో దిలీప్ హస్తంముందని ప్రతి ఒక్కరికీ తెలిసినప్పటికీ... ఏ ఒక్క సినీ ప్రముఖుడు కూడా నోరు విప్పక పోవడానికి ఇదే కారణమని ప్రముఖ డైరెక్టర్‌గా ఉన్న వినయన్ ఆరోపిస్తున్నారు. 
 
దిలీప్ అరెస్టుపై ఆయన స్పందిస్తూ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను దిలీప్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని, ఫిల్మ్ అసోసియేషన్‌లో ప్రధానమైన వ్యక్తిగా ఉన్న దిలీప్‌ను తొలగించేందుకు పరిశ్రమలోని పెద్దలెవ్వరూ ధైర్యం చేయలేకపోయారన్నారు. నటిపై లైంగిక దాడి ఘటన అనంతరం దాని వెనుక ఉన్నది దిలీపేనని తెలిసినా అతడి గురించి ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, బాధిత నటికి మద్దతు ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాకపోవడం సిగ్గుచేటని ఆయన వాపోయారు.
 
బాధిత నటి తన గుప్పిట్లోకి రావడం లేదనే కక్షతోనే ఆమెపై దాడి చేయించాడని డైరెక్టర్ వినయన్ ఆరోపించారు. కేరళలోని తిరువనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 17 కారులో ప్రయాణిస్తున్న నటిని అపహరించి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో అనుమానితుడుగా ఉన్న ప్రముఖ నటుడు దిలీప్‌ను కేరళ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయంతెలిసిందే. ఈ అరెస్టుతో కేరళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దిలీప్ అరెస్టుపై స్పందించేందుకు నిర్మాతలు, నటీనటులు ఎవరూ ముందుకు రాలేదు. 

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం