Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశీ ఖన్నాతో ఎవరూ సినిమా చేయవద్దంటున్న బడా నిర్మాత.. ఎందుకు?

దిల్ రాజు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోహీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి. కొంతమంది యువ హీరోహీరోయిన్లతో సినిమాలు చేసేందుకు భయపడిన నిర్మాతలు ఉన్నారు. అయితే అలాంటి వారిని పెట్టి సినిమాలు తీసి వారిని పరిశ్రమలో నిలబెట్టారు దిల్ రాజు. ప్రస్తుతం

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (21:51 IST)
దిల్ రాజు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోహీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి. కొంతమంది యువ హీరోహీరోయిన్లతో సినిమాలు చేసేందుకు భయపడిన నిర్మాతలు ఉన్నారు. అయితే అలాంటి వారిని పెట్టి సినిమాలు తీసి వారిని పరిశ్రమలో నిలబెట్టారు దిల్ రాజు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్ రాశీ ఖన్నాకు అవకాశాలు ఇచ్చి ఆమెను అగ్రహీరోయిన్ సరసన నిలబెట్టింది కూడా దిల్ రాజే.
 
తాజాగా దిల్ రాజు నిర్మాతగా చిత్రీకరించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. విడుదలైన కొన్ని రోజులకే మంచి టాక్‌తో సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా కథను దిల్ రాజు హీరోయిన్ రాశీ ఖన్నాకు వివరించినప్పుడు చాలా బాగుందని చెప్పిందట. అయితే రెమ్యునరేషన్ కాస్త తగ్గించుకోవాలని రాశీ ఖన్నాను దిల్ రాజు కోరారట. అయితే అందుకు ఏమాత్రం రాశీ ఖన్నా ఒప్పుకోలేదట. 
 
దీంతో రాశీ ఖన్నాపై కోపం పెంచుకున్న దిల్ రాజు సినిమా పూర్తయిన తరువాత ఆమెతో ఎవరూ సినిమాలు తీయవద్దని నిర్మాతలకు స్వయంగా ఫోన్లు చేసి చెబుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కాస్తా రాశీ ఖన్నాకు తెలిసి దిల్ రాజును కలిసేందుకు ప్రయత్నిస్తోందట. కానీ దిల్ రాజు మాత్రం ఆమెకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారం సినీ పరిశ్రమలో జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments