Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు రెండో పెళ్లి: 30 ఏళ్ల అవివాహితను పెళ్లాడబోతున్నారా?

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:16 IST)
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సతీమణి అనిత 2017లో గుండెపోటుతో హఠన్మరణం చెందారు. దీనితో దిల్ రాజు చాలా రోజులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత సినిమా నిర్మాణంలో ఫుల్ బిజీ అయిపోతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
 
ఇటీవలే ఆయన సమంత ప్రధానపాత్రలో జాను చిత్రాన్ని నిర్మించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో వున్నాయి. ఇలా... దిల్ రాజు జీవితం పూర్తిగా సినిమా నిర్మాణంలో మునిగిపోయి వుంది. ఏదైనా కాస్త తీరిక దొరికితే తన కుమార్తె ఇంటికి వెళ్లి మనవరాలితో ఆటలాడుతూ వుంటారు. 
 
ఐతే.. కొన్నిసార్లు భార్య లేని లోటు, వంటరి యానం ఇబ్బందికి గురిచేస్తుంది. దిల్ రాజు జీవితంలో అలాంటి స్థితిని చూసిన ఆయన సన్నిహితులు రెండో పెళ్లి చేసుకుంటే జీవితంలో వున్న లోటు కాస్తయినా భర్తీ అవుతుందని సూచనలు చేస్తున్నారట. 49 ఏళ్లు నిండినా యువకుడిలా చలాకీగా వుండే ఆయన్ని చూస్తే చాలు.. సర్ పెళ్లి చేసుకోండి.... అంటూ సలహా ఇస్తున్నారట. దిల్ రాజు కూడా దీనిపై ఆలోచన చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ జనం టాక్.
 
మరోవైపు దిల్ రాజు ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన 30 ఏళ్ల అవివాహిత యువతిని పెళ్లాడబోతున్నారనీ, ఆమె సినీ ఇండస్ట్రీకి చెందినవారు కాదని సమాచారం. దిల్ రాజు కుటుంబానికి ఆ యువతి ఫ్యామిలీ గత కొన్నేళ్లుగా సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. సదరు యువతి కూడా దిల్ రాజును వివాహం చేసుకునేందుకు సమ్మతించడంతో ఇక పెళ్లే తరువాయి అంటూ టాలీవుడ్ సినీజనం చెప్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments