Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టిన దిల్ రాజు... ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడో తెలుసా..?

Dil Raju
Webdunia
గురువారం, 4 జులై 2019 (21:49 IST)
అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాల‌ని ట్రై చేస్తున్నారు. క‌మ‌ల్ - శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందే భార‌తీయుడు 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వాల‌నుకున్నారు. ఎనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. కానీ... ఎందుక‌నో దిల్ రాజు త‌ప్పుకున్నారు. అయినా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ఆప‌లేదు. ఎఫ్ 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌నున్నార‌ని.. బోనిక‌పూర్‌తో క‌లిసి ఎఫ్ 2 సినిమాని రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని అఫిషియ‌ల్‌గా గ‌తంలో ఎనౌన్స్ చేసారు. 
 
ఇప్పుడు ఈ సినిమా కంటే ముందుగానే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు దిల్ రాజు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన భారీ చిత్రం ఎవ‌డు. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మించారు. 2014లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. `హేట్ స్టోరీ4` ద‌ర్శ‌కుడు మిలాప్ జ‌వేరి, నిఖిల్ అద్వానీ ఇద్ద‌రు ఎవ‌డు సినిమాని చూసార‌ట‌. 
 
ఈ సినిమా న‌చ్చ‌డంతో దిల్ రాజుని కాంటాక్ట్ చేసార‌ట‌. బాలీవుడ్ రీమేక్‌ని దిల్ రాజు, నిఖిల్ అద్వానీ సంయుక్తంగా నిర్మిస్తార‌ట‌. మిలాప్ జ‌వేరి డైరెక్ట్ చేస్తార‌ట‌. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిన త‌ర్వాత ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ఎవ‌ర్ని ఎంపిక చేయాలి అనేది ఆలోచిస్తారట‌. ఈ విధంగా ఎవ‌డు సినిమాతో దిల్ రాజు బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vada Share : వడ షేర్ చేసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments