Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ ఐదు సినిమాలకు ఓకే చెప్పాడా..?

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (19:23 IST)
మాస్ రాజా రవితేజ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరోగా ఉన్నారు. అయితే... ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్స్ రావడంతో కెరీర్లో కాస్త వెనకబడ్డాడు. అయితే... వరుస ఫ్లాప్స్ వస్తున్నా రవితేజతో సినిమా చేయడానికి మాత్రం దర్శకనిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. త్వరలో విడుదల కానున్న క్రాక్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ కోసం రవితేజ షూటింగ్ చేస్తున్నారు.
 
క్రాక్ మూవీ పూర్తి చేసిన వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయున్నాడు. ఈ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత మల్టీస్టారర్ మూవీ అయిన అయ్యప్పనమ్ కోషియం రీమేక్‌లో నటించనున్నారు. రవితేజ, వక్కంతం వంశీతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే మరో యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు కూడా ఓ చెప్పాడట మాస్ మహారాజా.
 
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లను స్కోర్ చేసినప్పటికీ, రవితేజకు వరుసగా సినిమాలు ఉండటం విశేషం.
రవితేజ సినిమాలకు నాన్-థియేట్రికల్ హక్కులు రూపంలో మంచి రేటు వస్తుంది. రవితేజ వరుస అపజయాల తర్వాత కూడా తన పారితోషికాన్ని తగ్గించలేదు. ఏది ఏమైనా... ఐదు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను వరుసలో ఉంచిన ఏకైక టాలీవుడ్ హీరో రవితేజ. కరోనా మహమ్మారి ముగిసిన వెంటనే రవితేజ విరామం లేకుండా వర్క్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments