Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్‌వ‌ర్మ యూ ట‌ర్న్ తీసుకున్నాడా!

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (18:24 IST)
Ram Gopal Varma
రామ్ గోపాల్‌వ‌ర్మ ప్ర‌స్తుతం ఎ.పి ప్ర‌భుత్వాన్ని సినిమా స‌మ‌స్య‌ల‌పై గ‌ట్టిగా సోష‌ల్‌మీడియాలో నిల‌దీశారు. దానికి పేర్ని నాని కూడా స‌మాధానం ఇచ్చాడు. ఫైన‌ల్‌గా ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే మేం చేస్తున్న‌ట్లు మంత్రి బ‌దులిస్తున్నాడు.  పవన్ కళ్యాణ్ సినిమా, సంపూర్ణేష్ బాబు సినిమా ఈ ప్రభుత్వానికి ఒకటేనా? అంటూ త‌న‌దైన శైలిలో ప‌లు ప్ర‌శ్న‌లు వేసిన వ‌ర్మ‌కు ప‌రిశ్ర‌మ‌లో నాగ‌బాబు మిన‌హా పెద్ద‌గా స్పంద‌న లేదు. కార‌ణం ప్ర‌భుత్వంతో వ్య‌వ‌హారం. తిమ్మిని బ‌మ్మిని చేస్తూ ఫైన‌ల్‌లో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే ధోర‌ణి వుంటుంద‌నీ, దానితో అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని సినీ పెద్ద‌లు భావించారు. అందుకే వ‌ర్మ‌కు పెద్ద‌గా స‌పోర్ట్ ఇవ్వ‌డంలేద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.
 
మ‌రోవైపు వ‌ర్మ నిబ‌ద్ధ‌త‌కు ఎవ‌రూ ఓటు వేయ‌డంలేదు. గ‌తంలో ప‌రిశ్ర‌మపై అలిగి ముంబై వెళ్ళి పోయి తిరిగి వ‌చ్చి దెయ్యం, భూతం, ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌తో సినిమాలు తీశాడు. వాస్త‌విక‌త క‌థ అన్నా అందులో అవాస్తవం వుండ‌డంతోపాటు నా సినిమా నా ఇష్టం చూస్తే చూడండి. లేదంటే లేదనే స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. నేనేమీ స‌మాజాన్ని ఉద్ద‌రించ‌డానికి సినిమాలు తీయ‌డంలేద‌ని బాహాటంగానే అన్నాడు.
 
ఇక ఇటీవ‌లే వోడ్కా తాగుతూ, మ‌హిళ‌ల‌తో డాన్స్‌లు వేస్తూ, ఎవ‌రి అభిరుచి వారిది. నా రూటు ఇది .అంటూ మాట్లాడిన వ‌ర్మ‌ను ఎవ‌రు ప‌ట్టించుకుంటార‌నే ప్ర‌శ్న కూడా వుంది. మ‌రో విశేషం ఏమంటే, ఒక్కోసారి నిన్న మాట్లాడింది ఈరోజు మారిపోతంద‌నే నిసిగ్గుగా గ‌తంలో చెప్పాడు.
 
అలాంటి వ్య‌క్తి ఇప్పుడు రూల్స్ మాట్టాడ‌డం చాలామందికి రుచించ‌డంలేదు. అందులోనూ ప‌రిశ్ర‌మ‌లో నువ్వా? నేనా? అన్న రీతిలో పెద్ద‌లు వుంటే, వ‌ర్మ‌ను ఎలా న‌మ్మ‌గ‌ల‌ర‌ని సీనియ‌ర్ నిర్మాత తెలియ‌జేస్తున్నారు. ఇటువంటి స‌మ‌స్య‌లు ఛాంబ‌ర్ చూసుకొంటుంద‌నీ, దానికి అనుగుణంగా ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని సి.క‌ళ్యాణ్, దిల్ రాజు వంటి వారు కూడా చెప్పారు.
 
ఇక ఇలా ప్ర‌శ్న‌ల‌తో మంత్రిని సంధించిన వ‌ర్మ తాజాగా ఓ టీవీ ఇంట‌ర్వూలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం బాగా ప‌నిచేస్తుంది. మంచి నిబ‌ద్ధ‌త‌గ‌ల నాయ‌కుడు అంటూ స్టేట్ మెంట్ ఇవ్వ‌డం విశేషం. దీంతో వ‌ర్మ యూ ట‌ర్న్ తీసుకున్నాడ‌ని అనుకోవాల్సి వ‌స్తుంద‌ని ఫిలింన‌గ‌ర్లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మ‌రి సంక్రాంతి త‌ర్వాత సినిమా స‌మ‌స్య‌ల‌పై కొలిక్కి రావ‌చ్చ‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments