Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య నో చెప్పాడా...? ఐతే నేను చేస్తానంటున్న హీరో...

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (18:13 IST)
నాగ చైత‌న్య నో చెప్పిన క‌థ‌తో నాగ‌శౌర్య సినిమా చేయబోతున్నాడు. అవును... అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... లక్ష్మీసౌజన్య అనే నూత‌న ద‌ర్శ‌కురాలు ఆ మధ్య నాగ చైతన్యకి ఓ కథ వినిపించింది. చైతూకి కూడా కథ నచ్చిందని.. ఆమెతో సినిమా చేస్తున్నాడని వార్త బయటికొచ్చింది. అంతే కాదండోయ్.. హీరోయిన్‌గా రకుల్ కూడా ఫిక్స్ అన్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేసారు.
 
ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ... ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇప్పుడు సౌజన్య అదే కథను నాగశౌర్యతో చేయబోతోందని తెలిసింది. లేటెస్ట్‌గా సితార ఎంటర్టైన్‌మెంట్స్‌లో శౌర్య - సౌజన్య సినిమాను అనౌన్స్ చేశారు. నిజానికి సితార ఎంట‌ర్‌టైన్మెంట్ వాళ్ళు చైతూ కాంబినేషన్లో ఈ సినిమాను చేయాలని చూసారు.. కానీ కుదర్లేదు. ఇప్పుడు అదే సినిమాను శౌర్యతో నిర్మిస్తున్నారు.
 
 చైతూ పక్కకి తప్పుకున్నా సౌజన్యను ఇంతవరకూ వెయిట్ చేయించి ఎట్టకేలకు ఆమెకు అవకాశం ఇచ్చి సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమాలో శౌర్య మినహా నటించే కాస్టింగ్ గురించి డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇంకా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అక్టోబర్ నుండి షూట్ స్టార్ట్ చేసి వచ్చే వేసవికి సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క‌థ విష‌యంలో నాగచైత‌న్య క‌రెక్టా..? నాగశౌర్య క‌రెక్టా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో కలిసి జీవించాలని ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కసాయితల్లి!!

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments