యాంక‌ర్ ప్ర‌దీప్‌కు క‌రోనా పాజిటివ్‌!

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (17:13 IST)
pradeep
క‌రోనా మహ‌మ్మారి ఈసారి చాలా మంది ప్ర‌ముఖుల‌ను ఇంటివ‌ద్ద‌కే ప‌రిమితం చేస్తోంది. తాజాగా యాంక‌ర్‌, న‌టుడు ప్ర‌దీప్‌కు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది తెలిసింది. త‌ను కొద్దిరోజులుగా క్వారంటైన్‌లో వుంటున్న‌ట్లు స‌న్నిహితులు తెలియ‌జేస్తున్నారు. ఈ విష‌య‌మై ఆయ‌న ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే టీవీలో ప‌లు షోల‌లో ఆయ‌న యాంక‌ర్‌గా వున్న‌టువంటివి ముందుగానే చేసిన క‌నుక తాజాగా ఇటీవ‌లే చేసిన  'డ్రామా జూనియర్స్ సీజన్ 5' ప్రోమోలో  ప్రదీప్ కన్పించలేదు. ఆయ‌న స్థానంలో యాంకర్ రవి కనిపించడంతో ఈ వార్త‌కు బలం చేకూరినట్టయ్యింది. కాగా 2020 నుంచి పలువురు బుల్లితెర ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. నవ్య స్వామి, రవికృష్ణ, ప్రభాకర్, సాక్షి శివ, భరద్వాజ్, మాళవిక, సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ తదితరులు కరోనా సోకినవారి జాబితాలో ఉన్నారు.
 
ఇక ప్ర‌దీప్ త‌ను చేసిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా! సినిమాలో హీరోగా న‌టించాడు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఓ యాక్ష‌న్ స‌న్నివేశం చేస్తుండ‌గా చెట్టుపైనుంచి దూకడంతో ఎడ‌మ‌కాలు పాక్చ‌ర్ అయింది. ఆ స‌మ‌యంలో కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్ప‌టికీ ఆ పెయిన్ తాలూకు గుర్తులు క‌నిపిస్తాయి. ఏది ఏమైనా ప్ర‌దీప్ కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments