Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊర్వశి కుటుంబ కలహాలతోనే తాగుడుకు బానిసగా మారిందా? ఇలా చేసిందేమిటి?

ఒకప్పటి సినిమా హీరోయిన్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిన సీనియర్ నటి ఊర్వశి.. ఈ మధ్య వార్తల్లో నిలుస్తోంది. గతంలో మీడియా ముందు తప్పతాగి నోటికొచ్చినట్లు మాట్లాడిన ఊర్వశి.. తాజాగా మరోసారి వ

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (16:04 IST)
ఒకప్పటి సినిమా హీరోయిన్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిన సీనియర్ నటి ఊర్వశి.. ఈ మధ్య వార్తల్లో నిలుస్తోంది. గతంలో మీడియా ముందు తప్పతాగి నోటికొచ్చినట్లు మాట్లాడిన ఊర్వశి.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. కుటుంబాల్లో ఏర్పడే తగాదాలను పరిష్కరించే టీవీ రియాల్టీ షోను నటి ఊర్వశి నిర్వహిస్తోంది. 
 
ఈ కార్యక్రమానికి విబేధాలతో సతమతమవుతున్న ఓ జంట హాజరైంది. వారి మధ్య గొడవలను తగ్గించాల్సింది పోయి, నోటికి వచ్చినట్టు ఊర్వశి మాట్లాడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇదంతా ఓ మలయాళ టెలివిజన్ షోలో జరిగింది. 
 
మలయాళ ఛానల్‌లో వ్యాఖ్యాతగా ఉన్న ఓ షోకు మద్యం తాగి వచ్చిన నటి ఊర్వశి చేసిన వ్యాఖ్యలతో తన భర్తతో విభేదాలు పెరిగిపోయాయి. ఇంకా తన కాపురం కూలిపోయేలా ఉందని ఆరోపించింది.
 
జీ తెలుగు బతుకు జట్కా బండి తరహా మలయాళ టీవీ షో ''జీవితం సాక్షి''కి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ షోలో పాల్గొన్న ఓ జంటను కలపాల్సిందిపోయి.. ఊర్వశి ఓవరాక్షన్ ద్వారా విడిపోయేలా చేసిందని హెచ్చార్సీలో ఆమెపై కేసు నమోదు కావడం వివాదానికి దారితీసింది. దీంతో ఊర్వశికి కొత్త కష్టం వచ్చిపడింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments