Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్వాన్స్ తీసుకుని చెక్కేసిన భామ.. కేసు పెట్టిన చిత్ర యూనిట్ (Video)

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (15:47 IST)
తెలుగులో వచ్చిన చిత్రం "అర్జున్ రెడ్డి". విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, హీరోయిన్‌గా ఉత్తరాది భామ షాలిని పాండే. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో బోల్డ్‌గా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. 
 
ఈ కోవలోనే తమిళంలో హీరో విజయ్ ఆంటోనీతో నటించేందుకు అంగీకరించి, అడ్వాన్స్‌ తీసుకుని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. ఆ తర్వాత ఆమె స్పందించడం లేదు. కొన్ని రోజులు సజావుగా సెట్స్‌కి వచ్చి ఆపై షూటింగ్ ఎగవేతకు పాల్పడిందంటూ షాలినీపై చిత్రబృందం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. 
 
ఇప్పటికే చిత్ర నిర్మాత శివ అమ్మడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రిమినల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. షాలినీపై అంతకుముందే తెలుగు, తమిళ నిర్మాతల మండలిలోనూ ఫిర్యాదు చేశారు. 
 
మరోవైపు, షాలినీ ఇటీవలే బాలీవుడ్‌లో అదిరిపోయే చాన్సును కొట్టేసింది. నవతరం స్టార్ హీరో రణవీర్ సింగ్ పక్కన 'జయేశ్ భాయ్ జోర్దార్' అనే అనే చిత్రంలో నటించేందుకు సమ్మతం తెలిపింది. బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చిందన్న అహంకారంతో ఈ విధంగా ప్రవర్తిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments