Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎవరు జత కావాలన్నా వెళ్లిపోతావా' అనసూయా... ఆలీ మార్క్ కామెంట్స్

టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు తన మార్క్ కామెంట్స్ చేశారు. ఈ దఫా హాట్ యాంకర్ అనసూయను ఉద్దేశించి చేశాడు. దీంతో ఆహుతులంతా ఒక్కసారి అవాక్కయ్యారు. యాంకర్ అనసూయ, ఆలీ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఇటీవలే ఓ అవార్

Webdunia
సోమవారం, 15 మే 2017 (14:41 IST)
టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు తన మార్క్ కామెంట్స్ చేశారు. ఈ దఫా హాట్ యాంకర్ అనసూయను ఉద్దేశించి చేశాడు. దీంతో ఆహుతులంతా ఒక్కసారి అవాక్కయ్యారు. యాంకర్ అనసూయ, ఆలీ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ ఇటీవలే ఓ అవార్డ్స్ ఫంక్షన్ చేశారు. ఈ ఈవెంట్‌లో రాజ్‌తరుణ్‌ను వేదికపైకి రావాల్సిందిగా అనసూయ ఆహ్వానించింది. అయితే కొంచెం కొంటెగా మాట్లాడే రాజ్ తరుణ్ 'నాకు ఎవరూ జత లేరా?' అని అనసూయనుద్దేశించి కామెంట్ చేశాడు. 
 
దీనికి కారణం లేకపోలేదు. అప్పటివరకూ ఇద్దరినీ కలిపి ఆహ్వానించిన అనసూయ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం ఒక్కడినే ఆహ్వానించింది. దీంతో రాజ్ తరుణ్ ఆ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు స్పందించిన అనసూయ... పోడియం దిగి రాజ్‌తరుణ్‌తో కలిసి పైకి వచ్చేందుకు కిందకు వెళ్లింది. 
 
దీన్ని గమనిస్తూ వేదికపై ఉన్న ఆలీ... వెంటనే కలగజేసుకుని ‘ఎవరు జత కావాలన్నా వెళ్లిపోతావా’ అంటూ తన మార్క్ డైలాగ్‌ను సంధించాడు. ఈ కామెంట్‌తో అనసూయ అవాక్కైంది. దీంతో అక్కడున్న వారంతా పైకి పగలబడి నవ్వినా.. ఆలీకి ఇంకా ఈ వెటకారం తగ్గలేదంటూ చర్చించుకున్నారు. 
 
ఆలీ ఈ తరహా కామెంట్స్ చేయడం ఇది కొత్తేమి కాదు. గతంలో హీరోయిన్లపై సెటైర్లు వేస్తూ... ఇది జస్ట్ ఫర్ ఫన్... లైట్ తీసుకోమని చెప్పే ఆలీ... అనుష్క, సమంత లాంటి స్టార్ హీరోయిన్లపై కూడా గతంలో ఆలీ అభ్యంతరకర వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇప్పుడు తాజాగా అలీ బాధితుల జాబితాలోకి యాంకర్ అనసూయ వచ్చి చేరింది. 

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments