Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీకి చార్మి సలహా... ఐతే ఓకేనన్న 'పోకిరి' డైరెక్టర్... ఏంటది?

Webdunia
సోమవారం, 6 మే 2019 (12:14 IST)
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్‌గా రూపొందుతున్న‌ ఇస్మార్ట్ శంక‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల‌ గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం వార‌ణాసిలో జ‌రుగుతుంది. 
 
ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ స‌న్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయ‌ట‌. అయితే... సినిమా ప్రారంభోత్స‌వం రోజునే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి చెప్పిన డేట్‌కే రిలీజ్ చేసే పూరి ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేస్తామ‌ని ఎనౌన్స్ చేసారు. కానీ.. చెప్పిన‌ట్టుగా మే నెల‌లో ఇస్మార్ట్ శంక‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం క‌ష్టం అనిపిస్తుంది. 
 
ఎందుకంటే... ఇంకా టాకీ కంప్లీట్ చేయాలి. సాంగ్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. బ‌హుశా ఫ‌స్ట్ టైమ్ అనుకుంట పూరి చెప్పిన డేట్‌కి సినిమాని రిలీజ్ చేయ‌లేక‌పోవ‌డం అనేది. దీనికి కార‌ణం ఏంటంటే... లేట్ అయినా ఫ‌రవాలేదు సినిమా బాగా రావాలని పూరీకి చార్మి సలహాలు ఇస్తోందట. దీనితో పూరీ కూడా చిత్రంపై చాలా కేర్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నార‌ట‌. సినిమా బాగా రావాలి అనుకోవ‌డం మంచిదే. ఈసారైనా స‌క్స‌స్ వ‌స్తుందో లేదో మరి..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments