Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ కబాలి కొత్త రికార్డులు : ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.42 కోట్లు

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం కబాలి. ఈ చిత్రం రివ్యూలు సంగతి ఎలా ఉన్నా.. సినిమా అంతగా బాలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. ఈ చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (13:37 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం కబాలి. ఈ చిత్రం రివ్యూలు సంగతి ఎలా ఉన్నా.. సినిమా అంతగా బాలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. ఈ చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కబాలి చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రజినీ మేనియానే దీనికి కారణమని ఫ్యాన్స్ చెబుతున్నారు.
 
తొలి రోజు కబాలి సౌత్ కలెక్షన్స్ ఆశ్చర్యానికి గురిచేశాయి. సౌత్‌ ఇండియాలో మొదటి రోజు రూ.42 కోట్లు సాధించి కొత్త రికార్డుకు తెరతీసింది. నార్త్ ఇండియా స్టేట్స్‌తో పాటు హిందీ భాషలో రిలీజైన కబాలి తొలిరోజు రూ.5.2 కోట్లు సాధించింది. మలేషియాతో పాటు ఇతర దేశాల్లో రూ.17 కోట్లు రాబట్టింది. యుఎస్‌ఏలో ప్రీమియర్ షోకు రూ.13.4 కోట్లు సాధించి కబాలి సరికొత్త రికార్డులను సృష్టించింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదలైన ‘కబాలి’ సినిమా గత కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టడం ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘కబాలి’  కలెక్షన్లు లెజెండ్ రజినీ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాయని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్ దేవగణ్‌ కితాబిచ్చారు. మరోవైపు రజనీ సినిమాపై ఎప్పటిలాగే జోక్స్‌, ఛలోక్తులు ఆన్‌లైన్‌లో వీరవిహారం చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments