నన్ను బాగా తొందరపెడుతున్నారంటున్న కేథరిన్

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (20:15 IST)
చేసిన సినిమాలు తక్కువే అయినా కేథరిన్‌కు తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరే ఉంది. హాట్ హీరోయిన్‌గా కేథరిన్‌ను అభిమానిస్తుంటారు. కేథరిన్ సినిమాలంటే పడిచచ్చిపోయే అభిమానులు చాలామందే ఉన్నారు. అలాంటి కేథరిన్‌కు తెలుగులో అవకాశాలు బాగా తగ్గుతున్నాయట. అందుకు కారణం ఆమెకు కథలు నచ్చకపోవటమేనట.
 
తెలుగు సంగతి అటుంచితే తమిళంలో ఆమెకు అవకాశాలు బాగా వస్తున్నాయి. గ్యాప్ లేకుండా సినిమాలను చేసేస్తుంది కేథరిన్. ఇదే విషయాన్ని అడిగితే తమిళంలో మంచి కథలు వస్తున్నాయి.. అందుకే నటిస్తున్నానని చెబుతోందట. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కదా అని అడిగితే.. నాకు భాష ముఖ్యం కాదు నా క్యారెక్టర్.. కథ ముఖ్యం. అందుకే ఆలోచించి సినిమాలు చేస్తుంటాను.
 
తెలుగు, తమిళం ఇలా వేరు చేయడం నాకు ఇష్టం ఉండదు. తెలుగులో నాకు ఎన్నో హిట్లు వచ్చాయి. అయితే అవి నాకు పూర్తి సంతృప్తి ఇచ్చిందనుకోను. అలాంటి మంచి కథలు మళ్ళీ రావాలి. ప్రేక్షకులు బాగా ఆదరించాలని కోరుకుంటూ ఉంటానని చెబుతోంది కేథరిన్.
 
ఇప్పుడు నన్ను నా తల్లిదండ్రులు పెళ్ళి కోసం తొందరపెట్టేస్తున్నారు. పెళ్ళి చూపులు మొదలెట్టేశారు. అయితే నాకు ప్రేమ గురించి పెద్దగా తెలియదు. ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించలేదు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరిని ఓకే చెప్పేస్తే వారినే పెళ్ళి చేసుకుంటానంటోంది కేథరిన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments