Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవద్దు.. ముంచేస్తారు జాగ్రత్త: నీనా గుప్తా

Advertiesment
పెళ్ళైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవద్దు.. ముంచేస్తారు జాగ్రత్త: నీనా గుప్తా
, మంగళవారం, 3 మార్చి 2020 (18:32 IST)
Neena Gupta
సినీ ఇండస్ట్రీని ఇటీవలే మీటూ, క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు కుదిపేసిన నేపథ్యంలో.. సెలెబ్రిటీలు సైతం తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిర్గతంగా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీలు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లగక్కారు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పేరిట శ్రీరెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తాజాగా బాలీవుడ్ సినీ నటి నీనా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్‌తో నీనా గుప్తా సహజీవనం చేశారు. వారికి ఓ బిడ్డ కూడా జన్మించింది. ఆ తర్వాత రిచర్డ్స్‌తో ఆమెకు మనస్పర్థలు రావడంతో... ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమె మరొకరిని పెళ్లాడారు. ఆ నేపథ్యంలో పెళ్ళైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవద్దని నీనా గుప్తా హితవు పలికారు. ప్రస్తుతం ఈమె కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
పెళ్లైన వ్యక్తితో సంబంధం ద్వారా తాను నేర్చుకున్న గుణపాఠాలను ఆమె వెల్లడించారు. జీవితంలో ఎవరి తోడు లేకపోయినా ఒంటరిగా బతికేయవచ్చునని.. కానీ పెళ్లైన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దని నీనా గుప్తా నేటి తరానికి సూచించారు. పెళ్లైన వ్యక్తి తొలుత తన భార్య అంటే ఇష్టం లేదంటాడని, త్వరలోనే విడాకులు తీసుకుంటానని నమ్మిస్తాడని నీనా గుప్తా తెలిపాడు. చివరికి అతని మాటలు నమ్మితే మోసం చేస్తారని చెప్పుకొచ్చారు. 
 
చివరికి పెళ్లైన వ్యక్తితో సంబంధం అతనితో రహస్యంగా కలిసేలా చేస్తుందని వెల్లడించారు. ఇలా చాలా రోజులు గడిచిపోతాయని.. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే మాత్రం పెళ్లైన వ్యక్తికి చిరాకు వస్తుందని.. వాస్తవం గ్రహించేలోపే అతను కాస్త దూరమవుతాడని తెలిపారు. తన జీవితంలో కూడా ఇదే జరిగిందని... ఎంతో ఆవేదనను అనుభవించానని తెలిపారు. అందుకే అందరికీ చెబుతున్నానని... పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడొద్దని హెచ్చరిస్తున్నానని వీడియో ద్వారా వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరచాలనం వద్దు... నమస్కారం చేయండి.. మంత్రి సలహా