Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు నరేశ్ మాజీ భార్య రమ్యపై కేసులు నమోదు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (17:40 IST)
Naresh family
సీనియ‌ర్ న‌రేశ్ వేల‌ కోట్లాధిప‌తి. త‌న త‌ల్లి విజ‌య‌నిర్మ‌ల నుంచి వ‌చ్చిన ఆస్తులు ఆమె మ‌న‌వ‌ళ్ళ‌కు, న‌రేశ్ కు రాసిచ్చేసింది. ఇక న‌రేశ్ ఆస్తులతోపాటు వైవాహిక జీవితంలోనూ కొత్త ఒర‌వ‌డి సృష్టించాడు. న‌రేశ్ రెండో భార్య ర‌మ్య ర‌ఘుప‌తిపై కొంద‌రు మ‌హిళ‌లు పోలీసుకేసు పెట్టారు. గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ఈ కేసు న‌మోదైంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న న‌రేశ్ ఆమెకూ త‌న‌కూ ఎటువంటి సంబంధం లేద‌నీ, ఆమెపై వ‌స్తున్న ఆర్థిక లావాదేవీల గురించి త‌న‌కేమీ తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. 
 
ర‌మ్య‌పై ఐదుగురు మ‌హిళ‌లు కేసు పెట్టార‌ట‌. గ‌త కొద్దికాలం నాడు ఇదే త‌ర‌హాలో  శిల్పా చౌదరి కేసు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె సినిమా ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖ హీరో కుటుంబీకులు ఆమె ఉచ్చులో ప‌డ్డారు. మహేశ్ బాబు చెల్లెలు ప్రియదర్శిని కూడా శిల్ప బాధితురాలే. ఇక కొత్త‌గా ర‌మ్య చేసిన ఆ ర్థిక లావాదేవీల‌న్నీ ఆంధ్ర‌లోనే జ‌ర‌గ‌డం విశేసం. అయితే న‌రేశ్ పేరు అడ్డం పెట్టుకుని చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. పైగా ర‌మ్య మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె కావ‌డంతో ఆమె ప‌నులు ఈజీ అయిపోయాయి. ర‌మ్య హైదరాబాద్, అనంతపూర్, హిందూపూర్‌లో భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై త్వ‌ర‌లో ఆంధ్ర‌లోని ప్రాంతాల‌ను ప‌ర్య‌టించి ఫైన‌ల్‌గా ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లు పోలీసు వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయ‌ని వార్త ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments