Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సీనియర్ నరేష్‌ సతీమణి రమ్య రఘుపతిపై కేసు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (17:35 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో సీనియర్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై పోలీస్ కేసు నమోదైంది. నరేష్ పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో పోలీస్ స్టేషనులో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ మహిళలు ఇచ్చిన ఫిర్యాదులో హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్ నగరాల్లో భారీగా డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. నరేష్‌కు చెందిన ఆస్తులను చూపిస్తూ, ఈ ఆస్తులు తనకే చెందుతాయని పేర్కొంటూ డబ్బు వసూళ్లు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఈ వ్యవహారంపై హీరో నరేష్ స్పందించారు. రమ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, రమ్య రఘుపతి ఏపీ రాజకీయ నేత, మాజీ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తమ్ముడు కుమార్తె కావడం గమనార్హం. కాగా, నరేష్‌కు రమ్య రఘుపతి మూడో భార్య. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లాడారు. గత కొంతకాలంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments