Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ సినిమాలో అల్లు అర్హ... నిజమేనా?

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (16:06 IST)
Allu Arha
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "హరిహర వీరమల్లు". ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో "ఉస్తాద్ భగత్ సింగ్" అనే సినిమా చేయనున్నాడు. 
 
ఈ సినిమా తమిళ సినిమా "తెరి"కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇది రీమేక్ అయినప్పటికీ... హరీష్ శంకర్ కేవలం కథాంశాన్ని మాత్రమే తీసుకుని, పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా స్క్రీన్‌ప్లేను పూర్తిగా మార్చేశాడు.
 
రచయిత, దర్శకుడు దశరథ్‌ ఈ సినిమా స్క్రిప్ట్‌పై కూడా వర్క్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరం. "తెరి" సినిమాను తెలుగులో "పోలీసోడు"గా డబ్ చేసి విడుదల చేశారు దిల్ రాజు. 
 
ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ సినిమాని ఇప్పుడు రీమేక్ చేయాలనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో బన్నీ హీరో కూతురు నటించబోతుందనే టాక్ వస్తోంది. తమిళ సినిమాలో ఆ పాత్రలో మీనా కూతురు నటించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆమె పాత్రతో మొదలవుతుంది. 
 
తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ కూతురిగా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే... బన్నీ కూతురు అల్లు అర్హ.. పవన్ సినిమాలో కనిపిస్తుందని టాక్ వస్తోంది.
 
ఇప్పటికే అల్లు అర్హ సమంత "శాకుంతలం"తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పుడు ఆమెను పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటింపజేయాలనుకుంటున్నారు. ఈ విషయంపై హరీష్ శంకర్ ఇప్పటికే అల్లు కుటుంబాన్ని సంప్రదించినట్లు సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments