Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ - కాజల్ 'బ్రహ్మోత్సవం' కొత్త పోస్టర్ రిలీజ్.. లుక్ అదుర్స్...

Webdunia
గురువారం, 5 మే 2016 (10:22 IST)
ప్రిన్స్ మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ''బ్రహ్మోత్సవం''. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సమంత, కాజల్‌, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేసి సంచలనం సృష్టిస్తోంది. 
 
పోస్టర్‌లో మహేశ్‌బాబు కాజల్‌వైపు చూస్తుంటే.. ఆ చూపునకు కాజల్ సిగ్గు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్‌తో కలిసి ఆమె నటించిన 'బ్రహ్మోత్సవం' కొత్త పోస్టర్‌ను తన ఫస్ట్ ట్వీట్‌గా సోషియల్ మీడీయాలో పోస్ట్ చేసింది కాజల్. మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పీవీపీ సినిమా, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై ప్రసాద్‌ వి. పొట్లూరి, మహేశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బ్రహ్మోత్సవం' ఆడియో మే 7న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ సర్కారు

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌‌ను పూసిన నర్సు.. సస్పెండ్ అయ్యిందిగా

ఢిల్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి...? బీజేపీదే హవా-ఆప్‌కే గెలుపంటున్న కేకే సర్వే!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments