Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ బయోపిక్ తీస్తా, ఆర్జీవికి షాక్: ప్రముఖ రచయిత కసరత్తు

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (17:31 IST)
ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా అందరి మీద సినిమాలు తీసి ఇబ్బందులు పెట్టే ఆర్జీవీకి సినిమాతోనే చెక్ చెప్పాలని రచయిత, కవి జొన్నవిత్తుల డిసైడ్ అయ్యారట. ఆర్జీవీ క్యారెక్టర్ పోషించే నటుడు కూడా దొరికాడట. దాదాపు ఆర్జీవీ మాదిరిగానే ఉండే వ్యక్తి ఒకరు మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న జొన్నవిత్తల ఆయన్ను కలిసి సినిమాకు ఒప్పించినట్లు తెలుస్తోంది.
 
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తీయబోతున్నారట. ఆర్జీవీ మీద పీకలలోతు కోపం, కసి ఉన్న పలువురు ఈ సినిమా నిర్మాణానికి తమ వంతు సాయం చేస్తామని ముందుకు వచ్చారట కూడా. ఆర్జీవీ వ్యవహారాలు మొత్తం ఎండగట్టేలా స్క్రిప్ట్ తయారీ జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది.
 
ఆర్జీవీకి సంబంధించి అన్ని ప్రకోపాలు ఈ సినిమాలో చూపించబోతున్నారట. ప్రతి ఒక్కరినీ తన సినిమాతో ఎండగట్టే ఆర్జీవీని ఈ సినిమాతో ఏం చేయబోతున్నారన్న చర్చ బాగా వినిపిస్తోంది. ఈ బయోపిక్ పైన జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆర్జీవీ కూడా తెలుసుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments