Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 5 షాకింగ్ న్యూస్: కంటెస్టెంట్లలో కొందరికి కరోనా?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (21:37 IST)
బిగ్ బాస్ 5 షాకింగ్ న్యూస్ ఒకటి టీవీ ఛానళ్ల సర్కిళ్లలో చక్కెర్లు కొడుతోంది. క్వారెంటైన్ లోకి వెళ్లాల్సిన కంటెస్టెంట్లలో కొందరికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయ్యిందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అఫీషియల్ అనౌన్సుమెంట్ అయితే రాలేదు.
 
ఇకపోతే బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆలరించే రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇపుడు ఐదో సీజన్‌కు సిద్ధమవుతోంది. నిజానికి ఎపుడో ప్రారంభంకావాల్సిన ఈ షో... కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. 
 
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది. ఈ షో ప్రోమో ఇప్పటికే షూట్ చేసినట్లు .. స్వాతంత్య దినోత్సవ కానుకగా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ షో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది.
 
బిగ్ బాస్ షో మరోసారి టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్‌లను కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీజన్‌లో ఎక్కువమంది లేడీస్ కంటెస్టెంట్లు ఉండనున్నారట. 
 
షోలో పాల్గొనడానికి సెలెక్ట్ అయినవారు ఆగష్టు 22 నుండి క్వారెంటిన్‌లోకి వెళ్లిపోయారు. అక్కడ 15 రోజుల క్వారెంటిన్ తర్వాత సెప్టెంబర్ 5న కంటెస్టంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే హౌస్ మేట్స్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు కూడా పూర్తి చేసుకున్నాకే బిగ్ హౌస్ లోకి పంపనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments