Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ తెలుగు 3... ఎన్టీఆర్ కు రూ. 20 కోట్లు, ప్రైజ్ మనీ రూ. 1 కోటి?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (18:03 IST)
తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ సీజన్ 3కి రంగం సిద్ధం చేసుకుంటోంది. 3వ సీజన్ షోను భారీ ఎత్తున నిర్వహించాలని, దీనికి కూడా జూనియర్ ఎన్‌టీఆర్‌నే హోస్ట్‌గా పెట్టాలని స్టార్ మా యాజమాన్యం భావిస్తోందట. 3వ సీజన్‌ను గత రెండు సీజన్‌ల కంటే ఎక్కువ కాలం నిర్వహించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.
 
గత రెండు సీజన్లకు ప్రైజ్ మనీ 50 లక్షలు కాగా మూడవ సీజన్‌లో దాన్ని రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు వినికిడి. అంతేకాకుండా హోస్ట్‌గా జూనియర్ ఎన్‌టీఆర్ వస్తే అతనికి 20 కోట్లు అయినా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
 
అయితే జూనియర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు కమిట్ అయినందున అవసరమైతే రాజమౌళిని ఒప్పించి అయినా జూనియర్‌నే హోస్ట్‌గా పెట్టాలని యాజమాన్యం భావిస్తోందట. దీని కోసం జూనియర్‌ను శనివారం నాలుగు గంటలు, ఆదివారం నాలుగు గంటలు షోలో పాల్గొనేలా చేసి అటు సినిమాకు కూడా ఇబ్బంది కలగకుండా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా ఉండగా ఈ విషయంలో అన్నీ ఆలోచించిన తర్వాతే తన నిర్ణయం తెలియజేస్తానని అప్పటివరకు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని జూనియర్‌కు సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments