Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ బయోపిక్.. షర్మిల పాత్రలో భూమికా చావ్లా? జగన్ పాత్రలో ఎవరు?

మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ బయోపిక్‌కు 'యాత్ర' అనే

Webdunia
మంగళవారం, 22 మే 2018 (12:59 IST)
మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ బయోపిక్‌కు 'యాత్ర' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో విజయమ్మ పాత్రను 'బాహుబలి-2' ఫేం ఆశ్రిత వేముగంటి పోషించనున్నారు. 
 
ఇక వైఎస్సార్ కుమార్తె షర్మిల పాత్రలో భూమిక నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వైకాపా చీఫ్, వైఎస్సార్ తనయుడు జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. వైయస్ ప్రధాన అనుచరుడు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి నటించనున్నట్టు సమాచారం. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహివి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
మరోవైపు భూమికా చావ్లా అక్కినేని నాగచైతన్య యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అయిన ''సవ్యసాచి''లో చైతూకు అక్కగా కనిపిస్తుందట. అలాగే ప్రొడక్షన్ దశలో వున్న కామోషి సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక సమంత నటించే యూటర్న్ సినిమాలో భూమిక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments