Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావన కేసు ఎంతవరకు వచ్చింది..? నిర్మాతతో పెళ్లికి రెడీ అయిపోతున్న భావన..

హీరోయిన్ భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయతే ఈ కేసు ఎంతవరకు వచ్చింది? ప్రధాన నిందితుడు సునీల్ పోలీసుల విచారణలో ఏం చెప్పాడు? అనే

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (12:40 IST)
హీరోయిన్ భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయతే ఈ కేసు ఎంతవరకు వచ్చింది? ప్రధాన నిందితుడు సునీల్ పోలీసుల విచారణలో ఏం చెప్పాడు? అనే దానిపై చర్చ సాగుతోంది. తనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించవద్దని.. తాను ఆ పరీక్షకు సిద్ధంగా లేనని నిందితుడు సునీల్ కుమార్ కోర్టుకు తెలిపాడు. 
 
ఈ కేసుపై నిందితుడు సునీల్‌ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ వేగంగా పూర్తికావాలంటే నిందితుడికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. విచారణకు సునీల్ సహకరించడం లేదని, పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని తెలిపారు. అనంతరం ఈ కేసులో నిందితులుగా వున్న విగీష్, సునీల్‌కు న్యాయస్థానం ఈనెల పదో తేదీ వరకు పోలీస్ కస్టడీని పొడిగించింది.
 
ఇదిలా ఉంటే.. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. భావ‌న ఓ యువనిర్మాత ప్రేమ‌లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రూ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. స‌ద‌రు యువ‌నిర్మాత‌తో భావ‌న వ్య‌వ‌హారంపై అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ఇక ప్రేమ కాస్తా వివాహం వరకు వెళ్ళనుందని సమాచారం. ఈ మార్చి నెల‌లోనే ఈ జంట ఒక‌టి కానున్నార‌ని, సంసారంలో అడుగుపెడ‌తార‌ని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం