Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ - శ్రీయాభూపాల్‌ల సయోధ్యకు ఉపాసన యత్నం?

ప్రేమికులు అఖిల్ అక్కినేని - శ్రీయాభూపాల్ రెడ్డిల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తొలగించి, వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన మధ్యవర్తిగా రంగంలోకి దిగనున్నారు. దీంతో అక్కినేని కుటుంబ

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (12:29 IST)
ప్రేమికులు అఖిల్ అక్కినేని - శ్రీయాభూపాల్ రెడ్డిల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తొలగించి, వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన మధ్యవర్తిగా రంగంలోకి దిగనున్నారు. దీంతో అక్కినేని కుటుంబంలో మళ్లీ ఆశలు చిగురించేలా కనిపిస్తున్నాయి.
 
నిజానికి అక్కినేని అఖిల్‌, శ్రీయాభూపాల్‌ల వివాహం వచ్చే మే నెలలో ఘనంగా జరిపించాలని భావించారు. అయితే అనూహ్య రీతిలో వారి పెళ్లి రద్దయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అఖిల్‌, శ్రీయల మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలే వివాహ రద్దుకు కారణమనే వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ, ఈ వార్తలపై ఇటు నాగార్జున, అటు శ్రీయాభూపాల్ కుటుంబ సభ్యులు నోరు మెదపడం లేదు. 
 
ఈనేపథ్యంలో అఖిల్‌, శ్రీయల మధ్య విభేదాలను తొలగించేందుకు రామ్‌చరణ్‌ తేజ్‌ భార్య ఉపాసన రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. జీవీకే ఫ్యామిలీకి ఉపాసన కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా శ్రీయకు, ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్‌. అందుకే అఖిల్‌, శ్రీయల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉపాసన ప్రయత్నిస్తోందట. ఉపాసన రాయభారం ఫలించి, అఖిల్‌, శ్రీయ ఒక్కటవ్వాలని ఇరు కుటుంబా సభ్యులు కోరుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం .. బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది (Video)

రాజ్యసభకు వెళ్లకుంటే విశ్రాంతి తీసుకుంటా : యనమల రామకృష్ణుడు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవంలో నారా లోకేష్ దంపతులు (video)

రైతు చేయిని కొరికిన చేప... అరచేతిని తొలగించిన వైద్యులు!!

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments