Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ "మండేలా"గా బండ్ల గణేశ్?

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (21:41 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు. ఈయన ప్రధాన పాత్రధారిగా ఇటీవల వచ్చిన చిత్రం "మండేలా". మోడన్నా అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం థియేటర్‌లో విడుదల చేయకుండా, ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో డైరెక్టుగా ప్రసారం చేశారు. ఈ చిత్రంలో యోగిబాబు నాయీ బ్రాహ్మణ వృత్తి చేసే వ్యక్తిగా నటించారు. నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై తమిళనాడు నాయీ బ్రాహ్మణుల సంఘం తమను తక్కువ చేసి చూపించారంటూ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. 
 
ఇదిలావుంటే, ఈ సినిమాను తెలుగు రీమేక్‌ హక్కుల కోసం నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమా రైట్స్‌ దక్కితే.. ఆ సినిమాను నిర్మిస్తూ అందులో బండ్ల గణేశ్‌ టైటిల్‌ పాత్రలో నటించే అవకాశాలున్నాయి. 
 
ఇదే కనుక నిజమైతే బండ్ల గణేశ్‌ నటుడిగా మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నించినట్లే అవుతుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. రాజకీయాల్లో బిజీగా ఉండి.. అక్కడి నుంచి సినీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేశ్‌ గత ఏడాది విడుదలైన హీరో మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. అలాగే ఇప్పుడు నిర్మాతగా పవన్‌ కళ్యాణ్‌తో సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments