బాల‌య్య ఆ డైరెక్ట‌రుకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా..?

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం హైద‌రాబాదులో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. భారీ తారాగ‌ణంతో రూపొందుతోన్న ఈ సినిమాపై అటు అభిమానుల

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (13:47 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం హైద‌రాబాదులో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. భారీ తారాగ‌ణంతో రూపొందుతోన్న ఈ సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే... బాల‌య్య గురించి ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... బాల‌య్య ఓ యువ ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని. ఇంత‌కీ ఆ యువ ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే.. ప‌టాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల‌తో ఎఫ్ 2 అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుక‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య సినిమా స్టార్ట్ చేస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఇదే క‌నుక నిజ‌మైతే బాల‌య్య‌ను ఈ యంగ్ డైరెక్ట‌ర్ ఎలా చూపిస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మళ్లీ ఘోర ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్.. బస్సు నుజ్జు నుజ్జు.. ఏమైంది?

మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హత్

శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఆ గ్రామ మహిళలు యేడాదికో కొత్త భాగస్వామితో సహజీవనం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రధాని పుట్టపర్తి పర్యటన.. ప్రశాంతి నిలయానికి 100 గుజరాత్ గిర్ ఆవులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments