Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా చెల్లెమ్మతో గొడవ వద్దంటున్న బాలయ్య? (video)

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (20:07 IST)
బాలయ్య, రోజా కాంబినేషన్ ఒకప్పుడు అదుర్స్. వీరి సినిమాలంటే అభిమానులు అప్పట్లో పడిచచ్చే వాళ్ళు. భైరవద్వీపం, బొబ్బిలిసింహం, పెద్దన్నయ్య లాంటి సినిమాల్లో వీరిది హిట్ పెయిర్. వీరు కలిసి నటించిన సినిమాలన్నీ భారీ విజయాలే సాధించాయి. అందుకే వీరి కాంబినేషన్లో అప్పట్లో చాలా సినిమాలే వచ్చాయి.
 
అలాంటి వీరిద్దరు ఒక సినిమాలో విలన్ గాను, హీరోగాను కనిపించబోతున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది. హీరోగా బాలయ్య బాబు, విలన్‌గా రోజా. ప్రస్తుతం బాలక్రిష్ణ కె.ఎస్.రవికుమార్ దర్సకత్వంలో రూలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలో సినిమా కూడా పూర్తి కాబోతోంది.
 
ఈ సినిమా తరువాత బాలక్రిష్ణ బోయపాటి శ్రీను దర్సకత్వంలో ఒక సినిమాను ఇప్పటికే సంతకం కూడా చేసేశారు. అది కాస్తా ప్రారంభం కూడా అయ్యింది. ఆ సినిమాలో విలన్ పాత్రను రోజా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరు రాజకీయంగా విరోధులు. అయితే సినిమాల్లో మాత్రం కాదు. నిజజీవితంలో ఎలా ఉన్నా సినిమా అంటే సినిమానేగా. దీంతో బోయపాటి శ్రీను ముందుగా రోజాతో మాట్లాడితే ఆమె సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారట.
 
అయితే బాలక్రిష్ణపై నమ్మకం పెట్టుకున్న బోయపాటి ఆయన్ను మాత్రం అడగలేదట. అయితే విలన్ పాత్ర రోజా చేస్తున్నారని తెలుసుకున్న బాలయ్య... చెల్లెమ్మ రోజాతో గొడవెందుకు.. విలన్ పాత్రను మారిస్తే బాగుంటుంది కదా శీను అంటూ బోయపాటిని కోరారట బాలయ్యబాబు. అయితే సినిమానే కదా. ఆమె కూడా ఒప్పుకున్నారు.

కథ కూడా బాగుంది కాబట్టి సినిమా బాగా హిట్టవుతుందని ఒప్పుకోండి ప్లీజ్ అంటూ బోయపాటి బాలక్రిష్ణను ఒప్పించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అవుతుందోనన్న ఆసక్తిలో అటు రోజా అభిమానులు, ఇటు బాలయ్య అభిమానులు ఆశక్తిగా ఉన్నారట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments