Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్‌‌ కంటే ప్రభాస్‌కు జీతమెక్కువా? ఆ రికార్డును బాహుబలి బ్రేక్ చేస్తాడా?

రెబల్ స్టార్ ప్రభాస్‌‌కు బాహుబలి సినిమాతో సూపర్ క్రేజ్ వచ్చేసింది. బాహుబలిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రభాస్.. రెమ్యూనరేషన్ విషయంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను మించిపోయాడని కోలీవుడ

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (17:51 IST)
రెబల్ స్టార్ ప్రభాస్‌‌కు బాహుబలి సినిమాతో సూపర్ క్రేజ్ వచ్చేసింది. బాహుబలిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రభాస్.. రెమ్యూనరేషన్ విషయంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను మించిపోయాడని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బాహుబలి రెండు పార్టులతో ప్రభాస్‌కు నిర్మాతలు భారీగా పారితోషికం ఇచ్చేందుకు సై అంటున్నారట.  
 
ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రభాస్ రూ.30కోట్ల పారితోషికాన్ని పుచ్చుకోనున్నాడట. పారితోషికం మాత్రమే కాకుండా సినిమా సేల్‌లోనూ ప్రభాస్‌కు షేర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రభాస్ పొందే ఆదాయాన్ని లెక్కచేస్తే.. రజనీకాంత్ ఇంతవరకు తీసుకున్న జీతం కంటే ఎక్కువని సినీ జనం అంటున్నారు.
 
గత ఏడాది రజనీకాంత్ నటించిన ఓ సినిమాకు రూ.26 కోట్లు పొందారని.. ఇతరత్రా ఆదాయాన్ని కలిపి రూ.55 కోట్ల మేర గత ఏడాది ఆర్జించారని సమాచారం. దీంతో ఆసియాలోనే అత్యధిక పారితోషికాన్ని పుచ్చుకునే నటులలో జాకీ చాన్ తర్వాత రజనీకాంత్ నిలిచారు. అయితే ఆ రికార్డును ప్రభాస్ బద్ధలు కొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సాహో చిత్రం ద్వారా ప్రభాస్ పొందే ఆదాయంతో సూపర్ స్టార్‌ను వెనక్కి నెట్టేస్తారని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments