Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం సమగ్రాభివృద్ధికి రూ.50 కోట్లు... కేంద్రం ప్రసాదం...(ఫోటోలు)

అమరావతి: పర్యాటక శాఖ గత కొద్దికాలంగా చేస్తున్న కృషి ఫలితాలను ఇచ్చింది. కేంద్రం ప్రసాద్ పధకం కింద శ్రీశైలం సమగ్ర అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. శుక్రవారం హస్తిన వేదికగా కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశం ఈ నిర

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (17:12 IST)
అమరావతి: పర్యాటక శాఖ గత కొద్దికాలంగా చేస్తున్న కృషి ఫలితాలను ఇచ్చింది. కేంద్రం ప్రసాద్ పధకం కింద శ్రీశైలం సమగ్ర అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. శుక్రవారం హస్తిన వేదికగా కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా ఈ సమావేశంలో స్వయంగా పాల్లొన్నారు.
 
దేవాలయ పర్యాటకం అభివృద్ధిలో భాగంగా పురాతన శ్రీశైలం అభివృద్దికి నిధులు కావాలంటూ మీనా చేసిన విజ్ఞప్తి పట్ల ఈ సానుకూల నిర్ణయం వెలువడింది. నిజానికి గత కొంత కాలంగా ప్రసాద్ పధకం కింద శ్రీశైల సమీకృత అభివృద్ధికి నిధులు పొందాలని ప్రయత్నిస్తూ వస్తున్నప్పటికీ అది వివిధ కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా మీనా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ అంశానికి తగిన ప్రాధన్యత ఇస్తూ ఎప్పుడు హస్తిన వెళ్లినా సంబంధిత అధికారులతో నిధుల విషయంపై చర్చించేవారు. ఈ నేపధ్యంలోనే అక్కడి అధికారులకు శుక్రవారం శ్రీశైలం మహా పుణ్యక్షేత్రాన్ని ఏ తీరుగా అభివృద్ధి చేయదలుచుకున్నామన్న విషయాన్ని సచిత్రంగా ప్రదర్శించి, అవసమైన నిధుల గురించి వివరించటంతో తక్షణమే ఆమోదముద్ర లభించింది.
 
ఫలితంగా శ్రీశైల పుణ్యక్షేత్రం దేవాలయ పర్యాటకానికి ఒక మైలురాయి కానుందని ఈ సందర్భంగా పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. విభిన్న పనుల కోసం దాదాపు రూ.50 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో ఏ పనులు చేపట్టనున్నామన్న దానిపై కూడా పూర్తిస్ధాయి నివేదికను అందిచామన్నారు. ప్రధాన దేవాలయం అభివృద్దికి రూ. 16.50 కోట్లు వ్యయం అవుతుందని, శిఖరం అభివృద్దికి రూ.4.28 కోట్లు వ్యయం చేయవలసి ఉంటుందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు లభిస్తాయని, తద్వారా వారి సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదని అన్నారు. ఇప్పటికే ఉన్న రోప్వేను మరింతగా విస్తరించాలని నిర్ణయించామని, అది పాతాళగంగను చేరనుండగా, ఇందుకోసం రూ.1.31 కోట్లు వ్యయ అంచనాలు ఉన్నాయన్నారు. 
 
సౌకర్యవంతమైన రహదారులే పర్యాటక ఆకర్షణలో కీలకం కాగా ఇక్కడ ఆవిషయంపై ప్రత్యేకంగా దృష్టి నిలిపామని మీనా పేర్కోన్నారు. ఎక్కడా రాజీ పడకుండా రహదారుల ఆధునీకరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్ల  కోసం రూ.13.61 కోట్లు అవుతాయన్న అంచనాలు సిద్దం చేసామన్నారు. పధకం అమలుకు సంబంధించి పర్యాటక శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని, నిబంధనల మేరకు నిధులకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఇక్కడి దేవాలయంలో మల్లిఖార్జున స్వామి, భ్రమరాంబ దేవి కొలువై ఉన్నారని, అదే క్రమంలో పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా స్వామివారు, పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా అమ్మవారు కొలువు తీరారన్నారు. ఇలా జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట ఉండటం ఇక్కడే సాధ్యపడిందని, ఈ విశిష్టత మేరకే పర్యాటక శాఖ ఈ దేవాలయ పరిసర ప్రాంతాలను పెద్ద ఎత్తున అభివృద్ది చేయాలని నిర్ణయించిందని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. 
 
ప్రసాద్ పధకం అమలులో భాగంగా పర్యాటక సౌకర్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని, ఇందుకోసం దాదాపు రూ.రెండు కోట్లు వ్యయం అవుతుందన్నారు.  పార్కింగ్ అవసరాన్ని సైతం పరిగణనలోకి తీసుకున్నామని, బస్టాండు సమీపంలో ఒకటి, అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో మరొకటి ఏర్పాటు చేయనున్నామని ఇందుకోసం రూ.2.72 కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుందన్నారు. మొత్తం ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక సాంస్కృతిక ప్రదర్శన కేంద్రం, సౌండ్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేస్తామని, అడుగడుగునా పచ్చదనం వెల్లివిరిసేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసారు. ఒక్క శ్రీశైలమే కాకుండా ఇతర దేవాలయాలను కూడా అభివృద్ది చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు పర్యాటక రంగం పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని మీనా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments