Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా నష్టపోయిన "బాహుబలి" నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

'బాహుబలి' నిర్మాతలు భారీగా నష్టపోయారు. అదేంటి.... 'బాహుబలి' చిత్రం కనకవర్షం కురిపిస్తే.. ఆ చిత్ర నిర్మాతలు ఎలా నష్టపోతారన్నదే కదా మీ సందేహం. నిజమే.. ఇక్కడ 'బాహుబలి' చిత్ర నిర్మాతలు విపరీతమైన నష్టాలు అ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (16:20 IST)
'బాహుబలి' నిర్మాతలు భారీగా నష్టపోయారు. అదేంటి.... 'బాహుబలి' చిత్రం కనకవర్షం కురిపిస్తే.. ఆ చిత్ర నిర్మాతలు ఎలా నష్టపోతారన్నదే కదా మీ సందేహం. నిజమే.. ఇక్కడ 'బాహుబలి' చిత్ర నిర్మాతలు విపరీతమైన నష్టాలు అనుభవించారు. దీంతో వారు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. దీని వెనుక గల కారణాలను పరిశీలిస్తే... 
 
'బాహుబలి ది కంక్లూజన్' ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. దీంతో ఫస్ట్ పార్ట్‌ను ఉత్తరాదిన దాదాపు 1000 థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. 'బాహుబలి-1' చూసినవారికి 'బాహుబలి-2' టికెట్లు వచ్చేలా ఆఫర్ కూడా ప్రకటించారు. అయితే రి రిలీజ్ పెద్ద ప్లాప్ అయింది. ప్రేక్షకులు రాక థియేటర్స్ అన్నీ వెలవెలబోతున్నాయి.
 
'బాహుబలి' పార్ట్ 1 ఇప్పటికే అనేకసార్లు టీవీలో రావడం, ఆన్‌లైన్లో కూడా అందుబాటులో ఉండటం, ఇప్పటికే సినిమా డివీడీల రూపంలో కూడా రావడంతో ఎవరూ మళ్లీ భారీగా డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా థియేటర్స్ అద్దె, ఇతర ఖర్చుల రూపంలో భారీగానే నష్టం వచ్చిందట. 
 
కాగా, ఈనెల 28న 'బాహుబలి పార్ట్ 2- ది కంక్లూజన్' రిలీజ్ కానుంది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రాన్ని 6500 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రూ.1000 వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments