Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ శర్మతో అసిన్ విడాకులు తీసుకుందా?

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (12:24 IST)
Asin
ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని జంటలు పెళ్లి చేసుకున్నంత త్వరగానే విడాకులు తీసుకుంటున్నారు. కొన్నేళ్లు సహజీవనం చేసిన తర్వాత కొన్ని జంటలు విడాకులు తీసుకోవడం గమనార్హం. 
 
అభిప్రాయభేదాల కారణంగా చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ అసిన్ విడాకులు తీసుకోబోతుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసిన్ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. 
 
తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆమె తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ దగ్గుబాటి, నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్స్ సాధించింది. గజిని సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ స్టార్‌డమ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 
 
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు 2016లో వ్యాపారవేత్త రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అసిన్ సినిమాలకు దూరంగా ఉంది. పెళ్లయిన తర్వాత దంపతుల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం రాహుల్‌కి మరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని అసిన్‌కు తెలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటి నుంచి అసిన్ అతనికి దూరంగా ఉంటోంది. 
 
ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం అసిన్ పాపతో ఉంటోందని వార్తలు వస్తున్నాయి. రాహుల్‌తో విడాకులు తీసుకోవాలని అసిన్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అసిన్ విడాకులు తీసుకుంటుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరి విడాకుల వార్తలపై అసిన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments