Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరణ్‌, కొరటాల మధ్య గొడవ జరిగిందా? అందుకే సినిమా చేయడం లేదా?

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (17:16 IST)
మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య అనే భారీ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కొరటాల శివ ఓ సినిమా చేయాలనుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమాని సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా  ప్రారంభించడం కూడా జరిగింది. త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అనగా ఈ సినిమా అనుకోకుండా ఆగింది. ఆ తర్వాత మరోసారి చరణ్‌ - కొరటాల కలిసి సినిమా చేయాలనుకున్నారు కానీ.. కుదరలేదు. 
 
ఇదిలా ఉంటే.. చిరంజీవితో చేస్తున్న ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది. ఈ పాత్రను ముందుగా చరణ్‌‌తో చేయించాలి అనుకోవడం.. ఆ తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకుండా చరణ్ ఏ సినిమాలో నటించకూడదు... చరణ్ నటించిన ఏ సినిమాను ఆర్ఆర్ఆర్ కంటే ముందుగా రిలీజ్ చేయకూడదని కండిషన్ పెట్టారు. దీంతో చరణ్ తో చేయించాలి అనుకున్న కీలక పాత్రను మహేష్ బాబుతో చేయించాలనుకోవడం తెలిసిందే.
 
రీసెంట్‌గా రాజమౌళి చరణ్ ఆచార్య సినిమాలో నటించేందుకు.. ముందుగా రిలీజ్ చేసేందుకు ఓకే చెప్పడంతో ఆ పాత్రను ముందుగా అనుకున్నట్టుగా చరణ్ తోనే చేయిస్తున్నారు. అయితే.. ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ తో కొరటాల ఓ సినిమా చేయాలనుకున్నారు. దీనికి సంబంధించి కథను చరణ్‌కి చెప్పడం.. కథ విని చరణ్ ఓకే అనడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఆచార్య తర్వాత కొరటాల చరణ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదని తెలిసింది.
 
కారణం ఏంటంటే... ఆచార్య సినిమాలో కీలక పాత్రను కొరటాల మహేష్ బాబుతో చేయించాలి అనుకున్నారు. ఈ విషయం చరణ్‌‌కి చెబితే.. మహేష్ అయితే బాగానే ఉంటుంది. వెళ్లి అడగమంటే.. కొరటాల మహేష్ బాబుని కలిసి ఆచార్య సినిమాలోని కీలక పాత్ర చేయమని అడగడం.. పాత్ర నచ్చడం.. పైగా కొరటాలతో మంచి అనుబంధం ఉండడంతో మహేష్ ఓకే చెప్పడం జరిగింది. 
 
అయితే.. చిరంజీవి మాత్రం చరణ్ అయితే.. ఇది స్పెషల్ మూవీ అవుతుందని చెప్పడంతో కొరటాల కాస్త ఫీలయ్యారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. పైగా ఆచార్యలో రామ్ చరణ్‌ని డైరెక్ట్ చేసిన తర్వాత వెంటనే చరణ్‌‌తో సినిమా అంటే ఆడియన్స్‌లో అంతగా ఆసక్తి ఉండదనుకున్నారో ఏమో కానీ.. చరణ్‌తో సినిమా చేయడానికి కొరటాల పెద్దగా ఆసక్తి చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments