Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అలా వస్తా.. మీకు ఓకేగా... అత్తపాత్రలో మరో సీనియర్ నటి

నిరోషా. అస్సలు ఈ పేరు చాలామందికి తెలియదు. అప్పట్లో నిరోషా సినిమాలంటే ప్రేక్షకులు క్యూకట్టేవారు. తెలుగు, తమిళ బాషల్లో ఈమె నటించిన సినిమాల కోసం ప్రేక్షకులు ఎగబడి మరీ చూసేవారు. అయితే ఆ నిరోషా వివాహం చేసు

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (12:33 IST)
నిరోషా. అస్సలు ఈ పేరు చాలామందికి తెలియదు. అప్పట్లో నిరోషా సినిమాలంటే ప్రేక్షకులు క్యూకట్టేవారు. తెలుగు, తమిళ బాషల్లో ఈమె నటించిన సినిమాల కోసం ప్రేక్షకులు ఎగబడి మరీ చూసేవారు. అయితే ఆ నిరోషా వివాహం చేసుకున్న తర్వాత సీనిరంగానికి దూరమైపోయారు. అప్పుడప్పుడు అడపాదడపా సీరియళ్ళలో నటించారు. సినీనటి రాధిక చెల్లెలుగానే ఆమె ఎక్కువగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా రాధికా శరత్ కుమార్‌లు ఇద్దరూ కలిసి నిర్మించిన సీరియళ్ళలో నటించారు. కానీ తెలుగు సినిమాల్లో మాత్రం నటించలేదు. అప్పట్లో నిరోషాకు పోటీ రమ్యకృష్ణ, నదియాలే. వీరు ముగ్గురే అప్పట్లో నెంబర్ ఒన్ హీరోయిన్లు.
 
కానీ సినిమాల్లో రమ్యకృష్ణ, నదియాలు మాత్రం నటిస్తుండడం నిరోషా నటించకపోవడం తెలిసిందే. వారిద్దరు అత్త క్యారెక్టర్లు, అమ్మ క్యారెక్టర్లు చేస్తుంటే తానెందుకు చేయకూడదన్న ఆలోచన నిరోషాకు వచ్చిందట. వెంటనే రాధికకు ఆ విషయాన్ని చెప్పారట నిరోషా. ఇంకేముంది.. రాధిక కొంతమంది నిర్మాతలకు, దర్శకులకు ఈ విషయాన్ని చెప్పిందట. ఇప్పటికే రెండు సినిమాల్లో నిరోషాకు అత్త క్యారెక్టర్ ఇవ్వడానికి కూడా దర్శకులు సిద్ధమైపోయారని తెలుస్తోంది. మొత్తం మీద నిరోషా మళ్ళీ సినిమాల్లో నటించనుండటంతో ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments