Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ్రమరాంబకు పవన్ తెగ నచ్చేశాడట.. ఛాన్సొస్తే మాత్రం వదులుకోదట..

టాప్ హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పవన్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మనసు పడింది. పవన్‌తో ఇప్పదిదాకా కలిసి నటించని ఈ ముద్దుగుమ్మ.. మంచి ఛాన్స్ వస్తే వదిలిపెట్టేది లేదంటోంది. ఇటీవలే తనకు పవన్ కళ్యాణ్ సర

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (09:47 IST)
టాప్ హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పవన్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మనసు పడింది. పవన్‌తో ఇప్పదిదాకా కలిసి నటించని ఈ ముద్దుగుమ్మ.. మంచి ఛాన్స్ వస్తే వదిలిపెట్టేది లేదంటోంది. ఇటీవలే తనకు పవన్ కళ్యాణ్ సరసన నటించాలని ఉన్నట్లు తెలిపింది. రకుల్ చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. 
 
ఈ చిత్రంలో రకుల్ పోషించిన భ్రమరాంబ పాత్రకు ప్రశంసలు లభించాయి. టాలీవుడ్‌లో యువ హీరోలతోపాటు, టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మహేశ్ బాబుతో స్పైడర్ చిత్రంలో నటిస్తున్నది. అయితే ఈ బ్యూటీకి ఓ తీరని కోరిక ఏంటంటే? పవన్‌తో నటించలేదనేదే. పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు స్వయంగా రకులే చెప్పింది. 
 
కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో పవన్ నటిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత మహా అంటే మరో సినిమాలో నటించే అవకాశం కనిపిస్తున్నది. ఆ తర్వాత రాజకీయాలకు పరిమితం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తే వదులుకోకూడదని భ్రమరాంబ భావిస్తోంది. 
 
ఇకపోతే రకుల్ ప్రీస్ సింగ్ బుధవారం హైద‌రాబాద్‌లోని బేగంపేటలో సందడి చేసింది. ఫిల్మ్‌ఫేర్‌ నిర్వహించిన సెలబ్రిటీ మీట్‌ అండ్‌ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొని ఆమె అభిమానుల‌తో ఫొటోలు దిగింది. ఈ సంద‌ర్భంగా అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు ఇచ్చింది. త్వరలో జరగనున్న ఫిల్మ్‌ఫేర్ వేడుక‌లో తన డ్యాన్స్ ఉంటుంద‌ని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments