Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... అనసూయ రావాలంటే అంతివ్వాలా...?

అనసూయ తన రేటును అమాంతం పెంచేసింది. రేటంటే అటు బుల్లితెరపైనా, ఇటు వెండితెరపైన నటించడానికి తీసుకునే రెమ్యునరైజేషన్ అన్నమాట. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనసూయ ఆ తరువాత వెనక్కి తిరిగి చూడనేలేదు. ఒక టీవీ ఛానల్లో వ్యాఖ

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (18:38 IST)
అనసూయ తన రేటును అమాంతం పెంచేసింది. రేటంటే అటు బుల్లితెరపైనా, ఇటు వెండితెరపైన నటించడానికి తీసుకునే రెమ్యునరైజేషన్ అన్నమాట. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనసూయ ఆ తరువాత వెనక్కి తిరిగి చూడనేలేదు. ఒక టీవీ ఛానల్లో వ్యాఖ్యాతగా ప్రారంభించి, అన్ని టీవీల్లోను వ్యాఖ్యాతగా మారిపోయి ఆ తరువాత సినిమాల్లో కూడా నటించేస్తూ బిజీ అయిపోయిన అనసూయ ప్రస్తుతం తన రేటును పెంచేసుకుంది. 
 
గతంలో ఎన్నో సీరియళ్ళలో నటించి ఆ తరువాత రేటును పెంచేవారు. కానీ అనసూయ మాత్రం వచ్చిన కొన్ని నెలలకే తన రేటును మొదటికన్నా మూడురెట్లు పెంచేసిందట. దీంతో బుల్లితెర సినీ నిర్మాతలు ముక్కుపై వేళ్ళేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కానీ అనసూయ యాంకరింగ్ చేస్తున్న కార్యక్రమాన్ని తెలుగు అభిమానులు పిచ్చగా చూస్తుండటంతో ఇక ఆమె ఎంత అడిగినా ఇచ్చేందుకు సిద్థమైపోయారు.
 
ఇదిలా ఉంటే సినిమాల్లో కూడా అనసూయ డిమాండ్ చేస్తోందట. నాగార్జున సినిమాల్లో ఒక క్యారెక్టర్ చేసిన అనసూయ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తరువాత అడపాదడపా కొన్ని సినిమాల్లో చేసింది. అయినా అనసూయకు పూర్తిస్థాయి నిడివిగల క్యారెక్టర్ ఏ సినిమాలో రాలేదు. కానీ తన రేటును మాత్రం తగ్గించడం లేదట అనసూయ. ఒకే రేటు ఫిక్సంటూ అటు బుల్లితెర, ఇటు వెండి తెర నిర్మాతలకు తేల్చి చెబుతోందట.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments