Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్‌తో కలిసి నటించడం ఇష్టం లేకే అమలాపాల్‌ నుంచి విజయ్ దూరమవుతున్నాడా?

ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్‌లు త్వరలో విడిపోనున్నారు. విడాకులు కోరుతూ వారిద్దరు చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి, విడాకుల పత్రాలు సమర్పించారు. వీరి విడాకులకు కారణం స్

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (11:38 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్‌లు త్వరలో విడిపోనున్నారు. విడాకులు కోరుతూ వారిద్దరు చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి, విడాకుల పత్రాలు సమర్పించారు. వీరి విడాకులకు కారణం స్పష్టంగా తెలియదు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేక పోవడం వల్లే వీరిద్దరు విడిపోతున్నారనే ప్రచారం కోలీవుడ‌లో సాగుతోంది.
 
నిజానికి వారిద్దరు విడిపోవడానికి ప్రత్యేకంగా ఓ కారణం ఉందని కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు, హీరో ధనుష్‌ తాజా చిత్రంలో అమలాపాల్‌ పేరును ఖరారు చేశారు. అప్పటి నుంచే ఆ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు సమాచారం. ధనుష్‌తో జోడీగా అమలాపాల్ నటించడం ఏమాత్రం ఇష్టం లేని దర్శకుడు విజయ్... ఇదే విషయంపై భార్యతో వాదనకు దిగినట్టు వినికిడి. దీన్ని జీర్ణించుకోలేని అమలాపాల్.. అలాంటి వ్యక్తితో కలిసి సంసార జీవితాన్ని కొనసాగించడం కష్టమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 
 
ఫలితంగానే వారిద్దరు విడిపోవాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరపున న్యాయవాది సాయిబ్‌ జోస్‌ కిడానగూర్‌ పిటిషన వేయగా, ఆ సమయంలో అమలాపాల్‌, విజయ్‌ ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. 
 
కాగా, విజయ్‌ దర్శకత్వం వహించిన సినిమాల్లో అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించడం, ఇద్దరూ ప్రేమలో పడటం, పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా వీరు పెళ్లి చేసుకోవడం తెలిసిందే. కానీ, పెళ్లి తర్వాత కూడా అమలాపాల్‌ సినిమాల్లో నటించడం విజయ్‌కి ఇష్టం లేదని, ఆ కారణంతోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కథనాలు వచ్చాయి. విజయ్‌ ఈ వార్తలను ఖండించారు. మరోవైపు, అమలాపాల్‌ కూడాఇప్పటికే మూడు సినిమాలకు ఒప్పుకున్నారు. కారణమేదైనా, వీరు విడాకులకు సిద్ధమయ్యారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొంచివున్న భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక

తమిళనాడులో పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు.. న్యాయవాది ఫిర్యాదు మేరకు..

నెల్లూరులో ఫ్లెక్సీ బోర్డులు.. వైఎస్సార్‌సీపీ, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం

నవంబరులో ఏపీకి రానున్న నాలుగు కుమ్కీ ఏనుగులు

హస్తినలో సీఎం చంద్రబాబు... నేడు ప్రధాని మోడీతో భేటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments