Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడు2లో అమల.. నాగ్ సరసన నటిస్తుందా?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (14:33 IST)
2002లో విడుదలైన మన్మథుడు సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఖాతాలో హిట్ పడింది. ఈ సినిమా తర్వాత నాగార్జునను టాలీవుడ్ మన్మథుడు అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో మన్మథుడు అనే మూవీ తెరకెక్కగా ఇందులో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్రలు పోషించారు.
 
ఈ చిత్రానికి ఇప్పడు టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మరియు మాటలు అందించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఇందులో నాగార్జున హీరోగా నటిస్తుండగా, నాగ్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తోంది. మరో కథానాయిక కోసం చిత్ర యూనిట్ ఎంపిక చేసే పనిలో వుంది. 
 
ఈ నేపథ్యంలో సినిమాలో నాగార్జున సతీమణి, సినీ నటి అమల అతిథి పాత్రలో కనిపించనుందట. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. 
 
నాగార్జునతో వివాహమైన తరువాత అమల సినిమాలకు దూరంగా వున్నారు. ఆ మధ్య వచ్చిన ''లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'' సినిమాలో ఆమె తల్లిపాత్రలో మెప్పించారు. ఆ తరువాత మనం సినిమాలో గెస్ట్ రోల్లో మెరిశారు. ఇప్పుడు మన్మథుడు2లో ఒక అతిథి పాత్రలో ఆమె కనిపించనున్నట్టు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments