సుకుమార్ దర్శకత్వంలో బన్నీ... గుబురు గెడ్డంతో డిఫరెంట్ లుక్...

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (12:17 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కల మాస్టారుగా గుర్తింపు పొందిన దర్శకుడు కె. సుకుమార్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇందులో హీరో ద్విపాత్రాభినయం చేస్తుండగా, అల్లు అర్జున్ మాత్రం గుబురు గెడ్డెంతో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడట. 
 
ఇటీవలే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' చిత్రం సంక్రాంతికి విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. బన్నీ సినీ కెరీర్‍లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అలాగే, నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. 
 
ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ మరో చిత్రంలో నటించేందుకు కమిట్ అయ్యారు. ఈ చిత్రానికి కె.సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. స్మగ్లర్‌లకి సహకరించే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్రలో రింగుల జుట్టుతో.. గుబురు గెడ్డంతో ఆయన లుక్ కొత్తగా ఉంటుందని సమాచారం. ఈ లుక్ నేచురల్‌గా ఉండటం కోసమే ఆయన కొంత సమయం తీసుకుంటున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
 
ఈ సినిమాలో అల్లు అర్జున్ మరో పాత్రను కూడా పోషించనున్నాడనేది తాజా సమాచారం. ఆ లుక్ కాస్త స్టైలీష్‌గా.. మోడ్రన్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే సుకుమార్ 'రంగస్థలం'వంటి హిట్ ఇచ్చి వున్నాడు. మరో వైపున వరుస విజయాలతో రష్మిక దూసుకుపోతోంది. అల వైకుంఠపురములో చిత్రంతో బన్నీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగానే వున్నాయి. ఈ చిత్రానికి డీఎస్పీ సంగీత బాణీలను సమకూర్చనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నార... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...

Rythanna Meekosam: నవంబర్ 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం..

గొంతునొప్పి అని భూతవైద్యుడి వద్దకు వెళ్తే.. గదిలోకి తీసుకెళ్లి అరగంట పాటు రేప్

ప్రియుడితో రీల్స్ : ప్రశ్నించిన భర్తను హత్య చేసిన భార్య

కర్నాటక మాజీ సీఎంపై పోక్సో కేసు : వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments